Saripodhaa Sanivaaram : అందరితరపునా అడుగుతున్నా.. ఖుషి2 ఎప్పుడు సార్? ఎస్.జె. సూర్యకి ప్రియాంక రిక్వెస్ట్..

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో “సరిపోదా శనివారం” సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అంటే సుందరానికి తర్వాత ఈ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ సహా సాంగ్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలాగే మేకర్స్ కూడా నెల రోజుల నుండి సినిమాకు మంచి ప్రమోషన్లు చేస్తున్నారు. ఇక ఫైనల్ గా సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ మొత్తం రావడం జరిగింది. అలాగే నానితో పనిచేసిన పలువురు దర్శకులు గెస్ట్ లుగా రావడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ స్పీచ్ వైరల్ గా మారింది.

Priyanka Arul Mohan's request to SJ Surya about Khushi 2

ఎస్.జె. సూర్యకు ప్రియాంక రిక్వెస్ట్..

ఇక సరిపోదా శనివారంలో ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో ప్రియాంక తన క్యూట్ స్పీచ్ తో అదరగొట్టిందనే చెప్పాలి. ఇక ఈ ఈవెంట్ లో ప్రియాంక సినిమా గురించి మాట్లాడుతూ సినిమాలో పనిచేసిన చిత్ర యూనిట్ అందరికి స్పెషల్ గా పేరుపేరునా థ్యాంక్స్ చెప్పింది. అలాగే నానితో గ్యాంగ్ లీడర్ తర్వాత రెండో సారి వర్క్ చేస్తున్నానని ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఈవెంట్ లో నటుడు దర్శకుడు ఎస్.జె. సూర్య (S.J.Surya) గురించి స్పెషల్ గా చెప్పుకొచ్చింది ప్రియాంక. తాను ఎస్. జె. సూర్య కి పెద్ద ఫ్యాన్ అని, ఆయనతో ఇంతకు ముందు తమిళ్ లో డాన్ సినిమాలో నటించానని, మళ్ళీ ఇప్పుడు రెండో సారి ఈ సినిమాలో వర్క్ చేయడం హ్యాపీగా ఉందని అంది. అయితే ప్రియాంక పవన్ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ఫ్యాన్స్ తరపున ఎస్.జె.సూర్యని రిక్వెస్ట్ చేసింది. ప్రియాంకా మాట్లాడుతూ… అందరి తరపున అడుగుతున్నా సార్.. ఖుషి2 ఎప్పుడు?… మళ్ళీ చేస్తే పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సార్ తోనే చెయ్యండి. ఇట్స్ ఏ క్లాసిక్ ఫిల్మ్… అంటూ ఎస్.జె. సూర్యకు ప్రియాంకా రిక్వెస్ట్ చేసింది.

- Advertisement -

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ ప్రియాంక..

ఇక ఈ ఈవెంట్ లో ఎస్.జె. సూర్యని ప్రియాంక పవన్ సినిమా గురించి రిక్వెస్ట్ చేయడంతో ఈవెంట్ మొత్తం దద్దరిల్లిపోయింది. అయితే ఈ ఈవెంట్ లో ప్రియాంక అరుళ్ మోహన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన డ్రెస్సింగ్ అందంగా రెడీ అవడమే కాదు.. క్యూట్ తెలుగు స్పీచ్ తో అదరగొట్టింది. ఇక సరిపోదా శనివారం ఈవెంట్ లో హీరో నాని, అలాగే ఎస్.జె.సూర్య, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, ప్రొడ్యూసర్ దానయ్య, మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ బిజోయ్, నటీనటులు అలీ, అనిత చౌదరి, అభిరామి వంటి తారలు పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ఆగష్టు 29న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు