Saripodhaa Sanivaaram : నానికి శ్రీకాంత్ ఓదెల పర్సనల్ రిక్వెస్ట్..

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అంటే సుందరానికి తర్వాత ఈ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ సహా సాంగ్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. చిత్ర యూనిట్ కూడా గత కొన్ని వారాలుగా గ్యాప్ లేకుండా సినిమా కోసం వరుస ప్రమోషన్లు చేస్తుండగా, తాజాగా సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ మొత్తం విచ్చేయగా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలువురు దర్శకులు కూడా గెస్ట్ లుగా రావడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పీచ్ వైరల్ గా మారింది.

Director Srikanth Odela's personal request to Nani

నానికి శ్రీకాంత్ ఓదెల స్పెషల్ రిక్వెస్ట్…

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) స్పీచ్ వైరల్ అవుతుంది. నాని (Nani) గురించి ఈ ఈవెంట్ లో స్పెషల్ గా చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ… డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుండే తనకు చాలా క్లోజ్ అని చెప్పుకొచ్చాడు. ఇక నాని గురించి చెప్పుకొస్తూ.. నాని అన్న తనకు చాలా ఇష్టమని, తన ఫ్యామిలీ మెంబెర్స్ తర్వాత తానే ఎక్కువని, అంటూ.. నాని కి స్పెషల్ రిక్వెస్ట్ చేసాడు.. శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. నానిని డైరెక్టర్లందరిలో ఎక్కువగా వేధించేది తనేనని ఎప్పుడూ నానిని మాస్.. మాస్ అని అంటుంటానని… ఇప్పుడు కూడా అంటున్న ప్లీజ్.. నువ్వు మాస్ సినిమాలే చేయన్నా… ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్ ఓదెల. దీనికి నాని ఒక్క నవ్వు నవ్వి ఊరుకున్నాడు.

- Advertisement -

గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ…

ఇక సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, అలాగే దేవాకట్టా, శౌర్యువ్ వంటి దర్శకుల స్పీచ్ వైరల్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ లో హీరో సహా ఎస్.జె. సూర్య, ప్రియాంక అరుళ్ మోహన్ స్పీచ్ కూడా హైలెట్ అయింది. ఇక సరిపోదా శనివారం ఈవెంట్ లో హీరో నాని, అలాగే ఎస్.జె.సూర్య, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, ప్రొడ్యూసర్ దానయ్య, మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్, నటీనటులు అలీ, అనిత చౌదరి, అభిరామి వంటి తదితర నటీనటులు పాల్గొన్నారు. ఇక సరిపోదా శనివారం సినిమా ఆగష్టు 29న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు