Saripodhaa Sanivaaram : ఈవెంట్ లో చల్లబడ్డ ఆలీ.. బిహేవియర్ లో ఛేంజ్ గమనించారా..

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ మొత్తం విచ్చేయగా, ఈవెంట్ లో నానితో పనిచేసిన పలువురు దర్శకులు గెస్ట్ లుగా రావడం జరిగింది. ఇక సరిపోదా శనివారం సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ సహా సాంగ్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ కమెడియన్ అలీ కూడా హైలెట్ అయ్యాడు. ఈ సినిమాలో నటించాడో లేదో తెలీదు గాని, సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలీ స్పీచ్ వైరల్ గా మారింది.

Comedian Ali Speech in Saripodhaa Sanivaaram Pre Release Event

అలీ బిహేవియర్ లో ఛేంజ్..

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ అలీ (Ali) స్పీచ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అలీ గత కొన్నాళ్లుగా సినిమాల పరంగా అటు రాజకీయాల పరంగా ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజకీయాల వల్ల అలీ చాలామంది మిత్రులకు దూరమయ్యాడు. ఇక రీసెంట్ గా అలీ నటించిన డబుల్ ఇస్మార్ట్ తో ఎన్నో విమర్శలు మూటగట్టుకున్నాడు. దాంతో అలీ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ ని రిపేర్ చేస్తున్నాడు. తాజాగా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో అలీ మాటలు వైరల్ గా మారాయి. కేవలం స్పీచ్ మాత్రమే కాదు.. తన ప్రవర్తనలోనూ మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి అందరికంటే కాస్త ముందుగానే వచ్చిన ఆలీ, తర్వాత వస్తున్న చిత్ర యూనిట్ అందర్నీ గౌరవంగా హుందాగా పలకరించాడు. ఆ తర్వాత ఇండైరెక్ట్ గా పవన్ (Pawan kalyan) గురించి మాట్లాడి ఫ్యాన్స్ ని ఉత్తేజపరిచాడు.

- Advertisement -

పూర్తిగా మారిపోయిన అలీ…

ఇక ఈ ఈవెంట్ లో అలీ మాట్లాడుతూ.. సుమ ఇచ్చిన ‘ఎర్రటి కండువా’ ను చూపించి.. దీనికి ఓ స్పెషాలిటీ ఉందని, ఇప్పుడు దీన్ని చూస్తే అందరికీ ఆయనే గుర్తుకు వస్తాడంటూ… వాళ్లకి ఆ విషయం తెలుసని.. ‘ఆ.. ఆ’.. అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ని కూడా లైట్ గా ఇమిటేట్ చేసినట్టు ఉంది. ఇక అలీ అన్న ఈ మాటలకు.. పవన్ అభిమానుల గోలకు అక్కడి ప్రాంగణం మొత్తం హోరెత్తిపోయింది. అలాగే స్టేజ్ పై అలీ మాట్లాడుతూ.. నానితో పని చేయడం హ్యాపీగా ఉందని.. నిర్మాత దానయ్యకు (Dvv Danayya) సరిపోదా శనివారం సినిమాకు అలాగే, ఓజీ (OG) సినిమాకు మంచి లాభాలు రావాలని చెప్పుకుంటూ స్పీచ్ ముగించాడు. ఇక చివర్లో యాంకర్ సుమను .. నా సోదరి సుమ అంటూ సంబోధించడం వైరల్ గా మారింది. గమనిస్తే అలీ చాలా ఛేంజ్ అయ్యాడని తెలుస్తుంది.

గత సినిమాల ప్రభావంతో చల్లబడ్డ అలీ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ ని పూర్తిగా రిపేర్ చేస్తున్నాడు. అలాగే అలీ ఇప్పుడు ఏ రాజకీయాల్లోనూ లేడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ తర్వాత అలీ ఓజి లో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ – అలీ కాంబో మళ్ళీ వస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు