Actor : 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్ష… అవార్డు విన్నింగ్ యాక్టర్ సాహసం

Actor : డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాము అని ఎంతోమంది నటీనటులు చెప్పడం మనం విన్నాము. కానీ కొంతమందికి మాత్రం చదవాలనే ఆలోచన, ఆశ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదరదు. తాజాగా ఓ అవార్డు విన్నింగ్ యాక్టర్ మాత్రం 68 ఏళ్ల వయసులో తన చిరకాల కోరికను నిజం చేసుకునే ప్రయత్నం చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించాడు.

68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్ష

ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఎవరి గురించో కాదు అవార్డు విన్నింగ్ మలయాళ నటుడు ఇంద్రన్స్  గురించే. మలయాళ సినిమాలను ఎక్కువగా చూసే వారికి ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవేళ తెలియదు అనుకున్నా ఆయన ముఖం చూస్తే టక్కున గుర్తుపడతారు. మలయాళ సినిమాలలో ఎక్కువగా ఆయన సైడ్ క్యారెక్టర్లలో కన్పిస్తారు. ఆగస్టు 24న శనివారం 68 సంవత్సరాల వయస్సులో రాష్ట్ర అక్షరాస్యత మిషన్ నిర్వహిస్తున్న VII తరగతి సమానత్వ పరీక్షకు హాజరై చరిత్ర సృష్టించారు.

kerala-english-indrans-sy

- Advertisement -

మూడు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో అనేక పాత్రలను పోషించిన ఇంద్రన్స్ నిన్న ఉదయం 9.30 గంటలకు సర్కార్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కి చేరుకున్నారు. అతను ఇంగ్లీష్, మలయాళం, హిందీ అనే మూడు భాషా పేపర్‌లతో కూడిన తన పరీక్షను రాయగా, సాయంత్రం 4.30 గంటలకు పరీక్షలు ముగిశాయి. అక్షరశ్రీ మిషన్ నుండి ఫీల్డ్ వర్కర్ విజయలక్ష్మి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించి, బిజీ యాక్టింగ్ షెడ్యూల్ ఉన్నప్పటికీ పరీక్షకు కూర్చోవాలని నిశ్చయించుకున్న నటుడికి నేర్పించారు. మరి ఆయన ఈ పరీక్షలో పాస్ అవుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంద్రన్స్ సాంఘిక శాస్త్రం, సైన్స్, గణితం పరీక్షను ఆగస్టు 25న ఆదివారం నిర్వహిస్తారు. దాని ఫలితాలు రెండు వారాల్లో వెలువడతాయి. అతను ఏడవ తరగతి సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, అతను 10వ తరగతి సమానత్వ పరీక్షకు హాజరు కావడానికి అర్హత పొందుతాడు. సినిమా కమిట్‌మెంట్స్ కారణంగా, నేను సిద్ధం కావడానికి కొన్ని రోజులు మాత్రమే తీసుకున్నాను. నా కుటుంబం నాపై ఉంచిన నమ్మకంతోనే ఈ పరీక్షలు రాయగలిగాను అంటూ చెప్పుకొచ్చారాయన.

అక్షరాస్యత మిషన్ అంబాసిడర్‌గా

కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ డైరెక్టర్ ఎజి ఒలీనా మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలో ఇంద్రన్స్ ఉత్తీర్ణులైతే అక్షరాస్యత మిషన్ అంబాసిడర్‌గా నియమించాలని సిఫారసు చేస్తానని, చదువు పట్ల ఆయనకున్న మక్కువ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కాగా ఇంద్రన్స్ IV తరగతి తర్వాత చదువు మానేశారు.

హేమ కమిటీపై కామెంట్స్

ప్రస్తుతం సినిమా ఇండిస్ట్రీని కుదిపేస్తున్న హేమ కమిటీ నివేదిక గురించి ఎగ్జామ్ సెంటర్ బయట ఇంద్రన్స్ ను మీడియా ప్రశ్నించింది. ఇంద్రన్స్ వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వారు జాగ్రత్తగా ఉన్నారని, తనకు ఎలాంటి వివరాలు తెలియవని చెప్పారు. సినీ పరిశ్రమకు గానీ, మరెవ్వరికైనా ఎలాంటి నష్టం జరగదని, నిందితులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు