Chiranjeevi – Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారంతా ఒకప్పుడు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ లిస్ట్ లో మహేష్ బాబు ( Mahesh Babu ) కూడా ఉన్నారు. మహేష్ బాబు తన తండ్రి సినిమాలతో పాటుగా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) సినిమాలో కూడా నటించాడట.. ఆ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇంతకీ మహేష్ బాబు, చిరంజీవి కాంబోలో వచ్చిన ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ (Krishna ) తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. అప్పట్లో మహేష్ బాబు బొద్దుగా ఉండేవాడు. ఇంత లావుగా ఉంటూ కూడా ఈ రేంజ్ ఫైట్స్, డ్యాన్స్ ఎలా చేసేవాడు అని అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయేవారు. భవిష్యత్తులో మహేష్ బాబు హీరో గా ఎంట్రీ ఇస్తే, తండ్రిని మించిన సూపర్ స్టార్ అవుతాడు అని అప్పట్లో అందరూ అనుకునేవారు. వాళ్లంతా అనుకున్నట్టుగానే ఇప్పుడు మహేష్ సూపర్ స్టార్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇకపోతే మహేష్ బాబు కొడుకు దిద్దిన కాపురం, ‘బాలకృష్ణుడు’ వంటివి కమర్షియల్ గా సూపర్ హిట్స్ గా నిలిచాయి. వీటిల్లో కొడుకు దిద్దిన కాపురం చిత్రం గురించి ఇప్పుడు మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేసాడు. ఆయనకి తల్లిదండ్రులుగా సూపర్ స్టార్ కృష్ణ, విజయశాంతి నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా కృష్ణ నే. అయితే ఈ చిత్రాన్ని తొలుత మెగాస్టార్ చిరంజీవి తో తియ్యాలని అనుకున్నాడు కృష్ణ.. ఆ తర్వాత చిరు కూడా బిజీగా ఉండటంతో ఎక్కువగా ఫోర్స్ చెయ్యలేదని టాక్.. ఇకపోతే వీరిద్దరి కాంబోలో రెండు సార్లు సినిమాలు వస్తాయని అనుకున్నారు. కానీ కుదరలేదు. చిరంజీవి, మహేష్ బాబు కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వీరిద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి విశ్వంభర సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు. అటు మహేష్ బాబు కూడా రాజమౌళి కాంబోలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.