7 Years For Sandeep Reddy Vanga : ఏడేళ్ల క్రితం ఒకడు వచ్చాడు, తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు

7 Years For Sandeep Reddy Vanga : ఎప్పుడు జరిగే దానిని అనుభవం అంటారు. ఎప్పుడో జరిగే దానిని అద్భుతం అంటారు. 2017 ఆగస్టు 25న అలాంటి అద్భుతం ఒకటి జరిగింది. ఆ అద్భుతం పేరు అర్జున్ రెడ్డి. అవును సందీప్ రెడ్డి వంగ అనే దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేటికీ ఏడు సంవత్సరాలు అయింది. అప్పుడు ఎప్పుడో వచ్చిన శివ సినిమా తర్వాత అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఒక కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సంచలనాన్ని సృష్టించాడు. కథ కొత్తది కాదు, కథనం కూడా కొత్తది కాదు. కానీ దర్శకుడు ఆ సినిమాని తీసిన విధానం ఇప్పటికి ప్రేక్షకుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 

ఈ సినిమాకి సంబంధించి మొదటి టీజర్ రిలీజ్ అయినప్పుడే అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సందీప్ రెడ్డి టేకింగ్, సందీప్ రెడ్డికి మ్యూజిక్ మీద ఉన్న సెన్స్ ఇవన్నీ కూడా విపరీతమైన పేరును తీసుకొచ్చాయి. ఒక సీన్ ను సందీప్ రెడ్డి వంగా ఎలా డిజైన్ చేస్తాడు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. దాదాపు సినిమా మూడు గంటలకు పైగా డ్యూరేషన్ ఉన్నా కూడా అందరిని చాలా ఇంటెన్స్ తో కూర్చుని పెట్టగలగడం సందీప్ రెడ్డి వంగ టాలెంట్ కి నిదర్శనమని చెప్పాలి. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఏకంగా తెలుగు ఫిలిం అంతటినీ స్టన్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి.

- Advertisement -

 

అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం ఈ సినిమాకి ప్రత్యేకమని చెప్పాలి. ఒకప్పుడు పూరి జగన్నాథ్ చేసే సినిమాల్లో హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండేది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, అనిపించేది చేయటం పూరి జగన్నాథ్ హీరోల స్టైల్. సందీప్ రెడ్డి వంగ హీరోల విషయానికి వస్తే ఒక రిచ్ కైండ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ గా కనిపిస్తారు. ఇక అర్జున్ రెడ్డి సినిమా లో కూడా విజయ్ క్యారెక్టర్ అదే మాదిరిగా ఉంటాడు. ఈ సినిమా తీసిన విధానం చాలామందికి చాలా కొత్తగా అనిపించింది.ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Arjun Reddy - Disney+ Hotstar

7 Years For Sandeep Reddy Vanga

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, అంతటి ఇంపాక్ట్ ను మళ్లీ అర్జున్ రెడ్డి సినిమా క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత ఏకంగా బాలీవుడ్ లో అవకాశాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సౌత్ ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్ గా గుర్తింపు సాధించాడు. తీసినవి కేవలం మూడు సినిమాలే అయినా కూడా సందీప్ స్థాయిని ఎవరు టచ్ చేయలేరు అనే రేంజ్ కి వెళ్ళాడు అతి తక్కువ జర్నీలో 1000 కోట్లు సినిమా కూడా చేసేసాడు సందీప్. నేటికీ సందీప్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏడు సంవత్సరాలు అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు