Allu Arjun – Rekha : “అంతలా ఎగిరిపడకండి సార్”.. అల్లు అర్జున్ ను ఏకి పారేసిన నటి..

Allu Arjun – Rekha : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో స్టైలిష్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది. పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అయితే ఏపీ ఎన్నికల తర్వాత మెగా, అల్లు అర్జున్ మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ వీడియో పై ఓ నటి స్పందించి కామెంట్స్ చేసింది..

ఇక ఇటీవల రావు రమేశ్ ( Rao Ramesh) హీరోగా నటించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్ సుకుమార్ సతీమణి ఈ మూవీకి సమర్పకురాలిగా వ్యవహరించడంతో ఆ ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్యానించారు. అయితే మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనిపై మెగా ఫ్యాన్స్ ఓ రేంజులో ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం పై పెద్ద ఎత్తున చర్చే జరుగుతుంది.

Rekha Bhoj sensational comments on Allu Arjun
Rekha Bhoj sensational comments on Allu Arjun

తాజాగా ఈ విషయంపై ప్రముఖ నటి జనసేన నాయకురాలు అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు జనసైనికురాలు, సినీనటి రేఖా భోజ్ ( Rekha Bhoj ). మాంగళ్యం, దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమ: వంటి సినిమాలలో రేఖ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆస్తుల్ని, తను సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి విశాఖపట్నంలో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్‌లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ రేఖ ఫేమస్ అయ్యారు.. తాజాగా అల్లు అర్జున్ కామెంట్స్ పై ఈమె స్పందించింది.

- Advertisement -

ఆమె తన పేస్ బుక్ ద్వారా స్పందించారు…అంతలా ఎగిరిపడకండి సార్.. స్వయం ప్రకటిత సార్.. టాలీవుడ్‌లో ఎందరో కమెడియన్లు కనుమరుగయ్యారు. వీరి గురించి ఈ జనరేషన్ పిల్లలని అడిగితే తెలియదంటరూ.. కానీ అల్లు రామలింగయ్య గురించి అడిగితే 90 శాతం తెలుసంటారు. అల్లు వారసుడు అల్లు అరవింద్, ఆయన మనవళ్లు ఓ రేంజ్‌లో ఉన్నారు. ఎందుకు.. ఇప్పుడు చెప్పండి, ఎవరి లైఫ్‌లోకి ఎవరు వస్తే ఎవరి జీవితాలు బాగుపడ్డాయో.. ఆయన మీతో చుట్టరికం చేయడమే కాకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా పవన్, చరణ్‌లతో పాటుగా తన లెగసీని పంచాడు.” ఆయన మీరు సెటిల్ అయ్యేవరకు చూశారు. అది గుర్తు పెట్టుకోండి అంటూ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు