Darshan : జైల్లో ఉన్నా.. దర్శన్ కి సౌకర్యాలకేం లోటు లేదు.. అవి కల్పిస్తుంది ఎవరు?

Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలపై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కన్నడనాట సంచలనం రేపిన ఈ హత్య కేసులో దర్శన్ అలాగే తన ప్రియురాలు పవిత్ర గౌడ నిందితులుగా అరెస్ట్ కాగా, మరో పద్నాలుగు మంది కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయిన రోజు నుండి కొన్ని వారాల పాటు రోజుకో ట్విస్ట్ తో కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఈ కేసు ఇంకా కొలిక్కి రాకపోగా, దర్శన్ ప్రస్తుతం కర్ణాటకలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే తాజాగా దర్శన్ జైల్లో ఉన్న ఒక స్టిల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే దర్శన్ ఆ స్టిల్ లో ఊహించని విధంగా కనిపిస్తూ జనాలకి షాకిచ్చాడు.

Kannada star Darshan in jail still leaked

ఒక చేతిలో కాఫీ కప్పు.. మరో చేతిలో సిగిరెట్..

ఇక తాజాగా దర్శన్ (Darshan) మర్డర్ కేసులో అరెస్ట్ అవగా, జైల్లో ఉన్న విషయం తెలిసిందే. కేసు సంగతి అలా ఉంచితే, దర్శన్ జైల్లో ఉన్న తాజా స్టిల్ లీక్ కాగా, ఆ స్టిల్ లో దర్శన్ జైల్లో ఉన్న ఖైదీలా మాత్రం లేడు. దర్శన్ జైల్లో ఓ నలుగురితో కుర్చీలో కూర్చుని చేతిలో సిగరెట్, మరో చేత్తో కాఫీ కప్పుతో దర్శన్ మాట్లాడుతూ ఉన్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఇక దర్శన్ తో పాటు కూర్చుని ఉన్న వాళ్లలో ఒకరు దర్శన్ మేనేజర్ అని సమాచారం. ఇక ఈ స్టిల్ వచ్చిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ స్టిల్ చూసి నెటిజన్లు దారుణంగా ఫైర్ అవుతున్నారు. ఒక నటుడు అయినంత మాత్రాన జైల్లో ఉన్న ఖైదీ దర్శన్ కు ఇలాంటి రాజభోగాలు బాగానే కల్పించారని ట్రోల్ చేస్తున్నారు. అసలు జైలు అధికారులు దర్శన్ కి విలాసవంతమైన సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నారన్న వాదనలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.

- Advertisement -

ఈ సౌకర్యాలు కల్పిస్తుంది ఎవరు?

ఇక దర్శన్ జైల్లో ఉన్న ఈ స్టిల్స్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. అసలు జైల్లో ఉన్న దర్శన్ కి లాంటి సౌకర్యాలు ఎవరు కల్పిస్తున్నారు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. బహుశా పెద్ద పొలిటీషన్ హస్తం ఏమైనా ఉందా? లేక దర్శన్ ఏమైనా కోర్టులో సౌకర్యాలపై రిక్వెస్ట్ చేశాడా? లేదా బయటి నుండి దర్శన్ సన్నిహితులు మరేమైనా సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారా? అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మర్డర్ కేసులో కర్ణాటక కోర్టు దర్శన్, పవిత్ర గౌడ (Pavithra gowda) సహా మరో 15 మందికి ఆగస్టు 28 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. అయితే అప్పటివరకు జైల్లో దర్శన్ స్వేచ్ఛగా, తిరిగే సౌకర్యాలు జైలు అధికారులే కల్పించారని సమాచారం. మరి దీనిపై అఫిషియల్ గా పొలిసు శాఖ నుండి ఏమైనా డీటెయిల్స్ వస్తాయా అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు