35Chinna KathaKaadu : చిన్న కథ కాదు.. మేకర్స్ మనసు మళ్లిందా? ఓటిటి కే మొగ్గు చూపుతున్నారా?

35Chinna KathaKaadu : టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా “35 చిన్నకథ కాదు”. చాలా రోజుల కిందటే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిజానికి ఆగష్టు 15న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అప్పుడు ఉన్న సినిమాల పోటీ దృష్ట్యా ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే త్వరలో కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని మేకర్స్ చెప్పడం జరిగింది. ఇక సినిమా విషయానికి వస్తే.. నివేదా థామస్(Nivetha Thamous) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్స్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలని పెంచేయగా, ఈ సినిమాను రానా దగ్గుబాటి (Rana Daggupati) సమర్పిస్తుండటంతో ఇండస్ట్రీలో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమాని సడన్ గా వాయిదా వేశారు. అయితే తాజాగా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.

35Chinna Katha Kaadu Movie will release on 6th September

మేకర్స్ మనసు మళ్లిందా..

ఇక 35 చిన్న కథ కాదు (35Chinna KathaKaadu) సినిమా కొత్త రిలీజ్ డేట్ ని కాసేపటికిందే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తునట్టు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అసలు థియేట్రికల్ రిలీజ్ పై మేకర్స్ ఆసక్తిగా లేరన్న మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా థియేటర్లో ఆడుతుందా లేదా అన్న సందేహంతోనే మేకర్స్ ఉన్నట్టు కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా, థియేట్రికల్ బిజినెస్ కూడా ఆశించినంత అవడం లేదట. అందుకే మేకర్స్ ఓటిటి వైపు మొగ్గు చూసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

ఓటిటి కే మొగ్గు చూపుతున్నారా?

ఇక తాజాగా 35 చిన్న కథ కాదు మేకర్స్ ఓటిటి రిలీజ్ కు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పైగా రానా ఈ సినిమాని సమర్పిస్తుండడంతో తన పేరుమీదుగా డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ కి మంచి రేటు వస్తుందని సమాచారం. అదే థియేటర్లో రిలీజ్ చేస్తే, జనాలు వస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమాను థియేటర్లో సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తారా లేక, ఓటిటి కి షిఫ్ట్ అవుతారా అన్నది చూడాలి. ఇక ఈ సినిమాలో విశ్వ, ప్రియదర్శి (Priyadarshi), గౌతమి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను నందకిషోర్ ఈమని డైరెక్ట్ చేయగా, వివేక్ సాగర్ సంగీతం అందించడం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు