Actress Urvashi : అలాంటి వాళ్ళు వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ.. – సీనియర్ నటి ఊర్వశి

Actress Urvashi : మలయాళ ఇండస్ట్రీ లో జస్టిస్ హేమ కమిటీ నివేదికలో భాగంగా రోజుకో న్యూస్ బయటపడుతుంది. ఇప్పటి హీరోయిన్లే కాదు లైంగిక వేధింపులకు గురైన సీనియర్ నటీమణులు కూడా ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ఈ కమిటీకి మద్దతు తెలియచేస్తూ, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మలయాళ ఇండస్ట్రీని అభ్యర్థిస్తున్నారు. ఇక ఈ కాస్టింగ్ కౌచ్, లైంగిక ఆరోపణలు అనేవి ఇండియా మొత్తం లో ఉన్న అన్ని ఇండస్ట్రీలలో కూడా ఉన్న పెద్ద సమస్య అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజగా మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ ఏకంగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని కూడా వదల్లేదు. నిజానిజాలేంటో తెలీదుగానీ, మలయాళ మూవీ ఇండస్ట్రీ జనరల్ సెక్రటరీ సిద్ధిఖిపై ఓ హీరోయిన్ లైంగిక ఆరోపణలు చేయగా, అతను తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక దీనిపై మరికొందరు సీనియర్ నటీమణులు కూడా ముందుకొచ్చారు.

Senior Actress Urvashi sensational comments on Justice Hema Committee

అలాంటి వాళ్లకు ముందు రక్షణ కల్పించాలి – ఊర్వశి

ఇక మలయాళ ఇండస్ట్రీలో (Malayala Industry) జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ప్రస్తుతం ఆ ఇండస్ట్రీ లో సంచలనం రేపుతుంది. ఇక పలువురు మలయాళ సీనియర్ నటీమణులు, ఇతర భాషల హీరోయిన్లు కూడా లైంగిక ఆరోపణలు చేస్తూ, గతంలో జరిగిన సంచలన విషయాలను బయట పెడుతున్నారు. ఇక తాజాగా జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక పై సీనియర్‌ నటి ఊర్వశి (Actress Urvashi) కీలక వ్యాఖ్యలు చేశారు. నటి ఊర్వశి మాట్లాడుతూ… “ఈ విషయం తనను చాలా బాధించిందని, జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి విని షాకయ్యానని, తన లాంటి ఎంతోమంది మహిళలు జీవనోపాధి కోసం సినిమాల్లో పని చేస్తున్నాం కానీ, ఇలాంటి వారి మధ్య వర్క్‌ చేస్తున్నామని, చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చింది.

- Advertisement -

అయితే దీనిపై ఊర్వశి మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా అంతగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోలేదు కానీ, తన స్నేహితులు మాత్రం ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారని, తాను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లో తన అమ్మానాన్న అనుక్షణం తనకి సంబంధించి అన్ని విషయాలపై తెలుసుకుంటూ, వెంటే ఉండి రక్షణ కల్పించేవారని, చెప్పుకొచ్చింది. కానీ అప్పుడైనా, ఇప్పుడైనా ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే చాలా మంది నటీమణులు ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది, ముందు వాళ్ళకి హేమా కమిటీ వారు, ప్రభుత్వం వారు తగిన రక్షణ కల్పించాలి. ఏం జరిగినా క్షణాల్లో చర్యలు తీసుకోవాలని ఊర్వశి చెప్పుకొచ్చారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వివాదాలు జరగడం చాలా చూసాం. కానీ ఈ మధ్య కాస్త తక్కువైందని చెప్పాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు