Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi ) సినిమాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే చిరు అతి తక్కువ కాలంలో స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ఆయన కొడుకు కూడా స్టార్ హీరో అయ్యాడు.. కానీ సినిమాల స్పీడు మాత్రం తగ్గించలేదు. తగ్గేదేలే అంటూ కుర్ర హీరోలకు పోటి ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే అప్పటిలో చిరంజీవి నటించిన బాలీవుడ్ రీమేక్ సినిమాల గురించి ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ అవుతుంది. ఆ సినిమాలు ఏవో, ఎన్ని హిట్ టాక్ ను అందుకున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
మెగాస్టార్ చిరంజీవి 1992లో స్టార్ట్ చేశాడు. తెలుగు తో పాటు, బాలీవుడ్, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలను నటించి మెప్పించాడు. అలా బాలీవుడ్ లో హీరోగా చిరంజీవి నటించిన మూడు సినిమాలు తెలుగు సినిమాల రీమేక్ కథలే కావడం విశేషం. మొదట మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్లో రాజశేఖర్( Raja Sekar) హీరోగా నటించిన అంకుశం (Ankusam ) సినిమాను ప్రతిబంధ్ పేరుతో రీమేక్ చేసి నటించారు. ఈ సినిమాకు రవిరాజా పిన్నిశెట్టి దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఇక ఈ సినిమా అప్పట్లో మంచి సక్సస్ అందుకుంది.. ఆ తర్వాత హిందీలో కూడా వరుస అవకాశాలు తలుపు తట్టాయి..
అలాగే చిరు నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను మళ్ళీ ఆయనే హిందీలో ఆజ్ కా గూంఢారాజ్ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమాలో మీనాక్షి శేషాద్రి (Meenakshi Sheshadri) హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత తెలుగు తీరిక లేనంత బిజీ అయ్యాడు.
ఇక చివరగా.. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ జెంటిల్ మాన్ చిరంజీవి బాలీవుడ్లో ది జెంటిల్మెన్ పేరుతో తెరకెక్కించాడు. తమిళ్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఇక ఇదే సినిమాను బాలీవుడ్లో రిలీజ్ చేయగా.. అక్కడ ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక బాలీవుడ్‌తో పాటు చిరంజీవి తమిళంలో 47 డేస్ నాట్కల్తో పాటు.. మరో మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించి మెప్పించాడు. ఇక కన్నడలో సిపాయి, శ్రీ మంజునాథ సినిమాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇకపోతే ప్రస్తుతం ఆయన సినిమాల విషయానికొస్తే.. ఇప్పుడు వశిష్ఠ (Vasista ) దర్శకత్వంలో విశ్వంభరా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది.. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..