Rajamouli : తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి ( Rajamouli ) గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. ఆయన తెరకేక్కించిన బాహుబలి ( Bahubali ) సిరీస్ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతంలో వచ్చిన త్రిపుల్ ఆర్ (RRR )సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు ను అందుకుంది.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మహేష్ బాబు ( Mahes Babu ) తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. రాజమౌళి దగ్గర ఓ డైరెక్టర్ డబ్బులను తీసుకొని ఇప్పటివరకు ఇవ్వలేదని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరు ఎందుకు డబ్బులను తిరిగి ఇవ్వలేదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయన మరెవ్వరో కాదు.. హను రాఘవపూడి ( Hanu Raghavapudi ).. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు. ప్రతి డైరెక్టర్ కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం కోసం ఎంతో కస్టపడి వచ్చారు. అందులో డైరెక్టర్ హను రాఘవపూడి ( Raghavapudi ) కూడా కూడా ఒకరు. ఈయన ఇప్పటివరకు తెరకెక్కించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఈయన అందాల రాక్షసి సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా రాజమౌళి వ్యవహారించారు. జక్కన్న సహకారంతోనే హను ఇంతటి స్థాయిలో ఉన్నట్లు చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
హను రాఘవ పూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఆ సందర్భంలో ఆయన కేరీర్ ఇంత సక్సెస్ అవ్వడానికి రాజమౌళి ముఖ్య కారణం అని చెప్పాడు. షార్ట్ ఫిలిం తీసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో రాజమౌళి సతీమణి.. రమా రాజమౌళి దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నానని.. ఇంతవరకు అప్పు చెల్లించలేదని సరదాగా చెప్పుకొచ్చాడు. ఎందుకు తిరిగి ఇవ్వలేదు అని ప్రశ్నిస్తే.. కొన్ని రుణాలు అలాగే ఉంచుకుంటే బాగుంటాయని వెల్లడించాడు. ఆ బాకీ ఎప్పటికి ఇవ్వనని ఆయన చెప్పకనే చెప్పాడు. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక రాఘవ పూడి ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే..