Thandel : పాట కోసం ఏకంగా 900 మంది డాన్సర్లు.. సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట…

Thandel : అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి కాంబినేషన్ లో “తండేల్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి (Sai pallavi) ఈ సినిమాలో చైతన్య కి జోడీగా నటిస్తోంది. లవ్ స్టోరీ అనే బ్లాక్ బస్టర్ తర్వాత రెండో సారి ఈ కాంబోలో మూవీ వస్తుండడంతో ఫ్యాన్స్ లో క్రేజీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే షూటింగ్ మాత్రం నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఇక తండేల్ షూటింగ్ ఆల్మోస్ట్ 85 శాతం పూర్తి చేసేయగా, తాజాగా తండేల్ షూటింగ్ కి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.

NagaChaitanya Thandel Movie Song Update

900 మందితో భారీ జాతర సాంగ్ షూట్…

తండేల్ మూవీ (Thandel) లో ఓ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో ఓ భారీ సెట్ వేసిన మేకర్స్, ఆ సెట్ జాతరకు సంబంధించిందని తెలిసింది. అమ్మవారి సెట్, అలాగే మహా శివుడి విగ్రహం సెట్ నిర్మించగా, ఆ సెట్ లో పలు కీలక సన్నివేశాలతో పాటు, అదిరిపోయే పాట షూట్ చేసారు మేకర్స్. ఇక ఈ జాతర సాంగ్ లో దాదాపు 65 మంది కళాకారులను శ్రీకాకుళం నుంచి తీసుకువచ్చిన మేకర్స్, ఏకంగా 900 మందికి పైగా డ్యాన్సర్లు & జూనియర్ ఆర్టిస్ట్ లతో భారీ లెవెల్లో సాంగ్ ని చిత్రీకరించారట మేకర్స్. ఇక ఈ జాతర సాంగ్ సినిమాలోనే హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుందట.

- Advertisement -

రిలీజ్ డేట్ పైనే కన్ఫ్యూజన్?

అయితే తండేల్ షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నా రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ రావడం లేదు. నిజానికి సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన తండేల్, షూటింగ్ డిలే కారణంగా వాయిదా పడగా, ఆగష్టు 15కి రిలీజ్ చేస్తామని అన్నారు, అయినా కుదరలేదు. ఫైనల్ గా ఇప్పుడు డిసెంబర్ లో వస్తామని బన్నీ వాసు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే అది పుష్ప2 (Pushpa2) రిలీజ్ అప్డేట్ పైనే ఆధారపడి ఉంది. పుష్ప2 వాయిదా పడితే ఆ డేట్ కి తండేల్ వచ్చే అవకాశం ఉండగా, ఆ డేట్ కి పుష్ప వస్తే, తండేల్ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు