Star Heroine: విజయ్ కోసం స్టార్ హీరోయిన్ భారీ త్యాగం.. ఎవరూ ఊహించలేదుగా..?

Star Heroine.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దళపతి ( Vijay dalapati) ఈ మధ్య రాజకీయ పార్టీని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వచ్చే 2026 ఎన్నికలలో ఆయన పోటీ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా విజయ్ భార్య ఉండగానే స్టార్ హీరోయిన్ త్రిష (Trisha ) తో ఎఫైర్ నడుపుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా విజయ్ బర్తడే సందర్భంగా వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లారనే విషయాలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. దీనికి తోడు లిఫ్టులో వీరు దిగిన ఫోటోలు, అలాగే వెకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ విడివిడిగా తీసుకున్నా లొకేషన్ ని బట్టి ఇద్దరు ఒకే చోట ఉన్నారంటూ అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడిందనే చర్చ తెరపైకి వచ్చింది.

Star Heroine: Star Heroine made a huge sacrifice for Vijay.. no one expected..?
Star Heroine: Star Heroine made a huge sacrifice for Vijay.. no one expected..?

విజయ్ కోసం త్రిష భారీ త్యాగం

అయితే ఈ విషయాలన్నీ మరువకముందే ఇప్పుడు మరొక వార్త సంచలనంగా మారింది. విజయ్ తో త్రిష సంబంధం గురించి పెద్ద దుమారమే దక్షిణాది ఇండస్ట్రీలో చెలరేగింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీరిద్దరూ కూడా తమ పని ఏదో తాము చేసుకుంటూ పోయారే తప్ప ఈ రూమర్స్ పై ఏ రోజు కూడా స్పందించలేదు . అయితే ఇప్పుడు మరొక రూమర్ తెరపైకి వచ్చింది. స్టార్ హీరో విజయ్ కోసం త్రిష భారీ త్యాగం చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఐటెం సాంగ్స్ కి నో చెబుతున్న త్రిష..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటి వరకు నయనతార , కాజల్, సమంత, పూజా హెగ్డే, తమన్నా, శృతిహాసన్ ఇలా వీరు మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తుంటే త్రిష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయనంటూ మొండికేసింది. దీనికి తోడు భారీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. కానీ ఆమె మాత్రం నిరాకరిస్తుంది. చాలామంది స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో చేస్తున్నారు. మీకు అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాము అని నిర్మాతలు చెబుతున్నప్పటికీ ఒప్పుకోవడం లేదు. దాదాపు గత పది సంవత్సరాలుగా ఐటమ్ సాంగ్స్ కి దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

ప్రియుడు కోసం పదేళ్ల పంతాన్ని వీడిందిగా..

తాజాగా ఇప్పుడు తన ప్రియుడికి కోసం తన పంతాన్ని వదులుకుందనే వార్తలు తమిళ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ నటించిన తాజా చిత్రంలో త్రిష స్పెషల్ సాంగ్ చేసిందనే విషయం ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ గా మారింది. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu)దర్శకత్వంలో విజయ్ నటించిన గోట్ విడుదలకు సిద్ధమయింది. సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేపడుతున్నారు చిత్ర బృందం. అంతేకాదు ఇందుకోసం యూనిట్ సభ్యులంతా వివిధ దేశాలలో కూడా ప్రచారం చేస్తున్నారు.

త్రిష ఐటమ్ సాంగ్ పై చిత్ర బృందం క్లారిటీ..

ఇందులో భాగంగానే స్పెషల్ సాంగ్ పై కూడా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో ఒక పాటలో త్రిష నటించినట్టు, ఈ పాటను సర్ప్రైజ్ ఎలిమెంట్ గా తెరపైనే చూడాలని విషయాన్ని వారు వెల్లడించారు. మొత్తానికి అయితే త్రిష తన ప్రియుడు కోసం భారీ త్యాగమే చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ సినిమా విడుదలైన తర్వాత.. ఆ స్పెషల్ సాంగ్ లో ఎవరున్నారో చూస్తే తప్ప ఈ విషయం నిజం కాదు అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు