NBK50Years : అందరి కళ్ళు అబ్బాయి రాక కోసమే… ఇప్పటికైనా నందమూరి పౌరుషం తగ్గుతుందా..?

NBK50Years : నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా NBK50ఇయర్స్ వేడుక సెప్టెంబర్ 1న భారీ ఎత్తున జరగబోతున్న సంగతి తెలిసిందే. ‘తాతమ్మ కల’ సినిమాతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుండగా, తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన స్వర్ణోత్సవ వేడుకలను జరిపేందుకు సిద్ధమైంది. మునుపెన్నడూ లేని విధంగా ఓ సీనియర్ స్టార్ హీరో 50 ఏళ్ల ప్రస్థానంపై సెలబ్రేషన్స్ చేయనున్నారు. ఇక సెప్టెంబరు 1న జరగనున్న వేడుకను ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులు, నందమూరి కుటుంబీకులు కలిసి ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు జరపనున్నారు. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) తొలి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అలాగే పలువురు లెజెండరి దర్శకులు, స్టార్ హీరోలు వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అయితే ఇండస్ట్రీ సహా, నందమూరి అభిమానుల కళ్ళు మాత్రం ఆ ఒక్కరి కోసం ఎదురుచూస్తున్నాయి.

Junior NTR For Balakrishna NBK50Years Celebrations

అబ్బాయి రాకపైనే అందరి కళ్ళు…

నందమూరి ఫ్యామిలీ, అభిమానులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ఇండస్ట్రీ ప్రముఖులు ఎంతో మంది అతిథులుగా హాజరవుతున్నా అందరి కళ్ళు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) పైనే ఉన్నాయి. గత కొంత కాలంగా బాలయ్యకు – తారక్ కు కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. హరికృష్ణ చనిపోయిన తర్వాత వీళ్లిద్దరి మధ్య దూరం మరింత పెరిగిందన్న మాట వాస్తవం. అన్నిటికి మించి ఈ సారి ఎన్నికల్లో తారక్ ని ప్రచారం లో వాడుకోకపోవడం, తారక్ కూడా సైలెంట్ గా ఉండడం, ఎన్టీఆర్ 100 ఇయర్స్ వేడుకకు తారక్ ని ఆహ్వానించకపోవడం ఇలాంటివన్నీ, బాబాయ్ – అబ్బాయి ని మరింత దూరం చేసాయి. దీనిపై బాబాయ్ బాలయ్యే అబ్బాయి ని దూరం పెట్టాడని అభిమానులు కూడా అనుకుంటున్నారు.

- Advertisement -

నందమూరి పౌరుషం తగ్గిందా? కలయిక సాధ్యమేనా?

అయితే ఈసారి NBK50 ఇయర్స్ వేడుకతో నందమూరి కుటుంబీకులు, ఫ్యాన్స్ సహా ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం పంపుతున్నారట. నందమూరి బాలయ్య సోదరులు రామకృష్ణ, మోహన కృష్ణ ఆధ్వర్యంలో అబ్బాయి ఎన్టీఆర్ కి స్పెషల్ గా ఆహ్వానం వెళ్లిందట. మరి బాలయ్య అహం తగ్గిందా లేదా అన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఒకవేళ ఆహ్వానం అందినా తారక్ రాకపోతే మళ్ళీ మొదటికే వస్తుంది. ఏది ఏమైనా బాబాయ్ – అబ్బాయ్ ఇద్దరూ పౌరుషం పక్కన బెట్టి కలిస్తే, నందమూరి అభిమానుల ఆనందానికి అవధులుండవు. మరి 50 ఇయర్స్ వేడుకలో ఈ నందమూరి వారసుల కలయిక సాధ్యమవుతుందా లేదా అన్నది తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు