Ravi Teja : ఫోటో తీసిన నర్సుల జాబ్ పోయింది… రవితేజ హెల్ప్ చేస్తాడా..?

Ravi Teja  :మాస్ మహారాజ్ రవితేజకు రీసెంట్ గా నాలుగు రోజుల కింద తన 75వ సినిమా షూటింగ్ లో ఆక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న తన 75వ (RT75) సినిమా షూటింగ్ లో ఓ కీలక సన్నివేశం చిత్రీకరిస్తుండగా, ఆ షూటింగ్లో రవితేజకు కొద్దిపాటి గాయం కాగా, ఆ గాయంతోనే దాదాపు ఆ షూటింగ్లో పాల్గొన్నాడు రవితేజ. ఈ క్రమంలో ఆ గాయం కాస్త సీరియస్ అయింది. కుడి చేతికి గాయం ఎక్కువగా కావడంతో వెంటనే యశోద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేశారు. ఇక రవితేజ కి ట్రీట్మెంట్ చేసిన నెక్స్ట్ డే నే డిశ్చార్జ్ కాగా, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నాడు. దాదాపు ఆరు వారాలపాటు రవితేజ (Ravi Teja) విశ్రాంతి తీసుకోవాలని యశోద హాస్పిటల్ యాజమాన్యం చెప్పుకొచ్చారు. అయితే రవితేజకు ట్రీట్మెంట్ ఇస్తున్న పిక్ ఆరోజు నెట్టింట బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.

Yashoda management suspended nurses who took photo of Ravi Teja's treatment

ఫొటో తీసినందుకు నర్సుల జాబ్ పోయింది…

రవితేజ గాయం తగిలాక యశోద హాస్పిటల్ లో రవితేజకు ట్రీట్మెంట్ ఇస్తున్న పిక్ నెట్టింట బాగా వైరల్ అయింది. ఆ ఫొటో చూసి రవితేజ అభిమానులు కూడా బాగా కంగారు పడ్డారు. కానీ డాక్టర్లు, చిత్ర యూనిట్ వెంటనే చిన్న గాయమే అని క్లారిటీ ఇచ్చారు. అయితే రవితేజ చేతికి జరిగిన ప్రమాదంలో యశోద హాస్పిటల్ లో జాయిన్ అయిన సమయంలో, అక్కడ ముగ్గురు నర్సులు కలిసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారట. ఆ ఫొటోనే నెట్టింట వైరల్ అయింది. దాంతో ఆ నర్సులు ముగ్గురిని హాస్పిటల్ యాజమాన్యం సస్పెండ్ చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీస్ చాలా మంది యశోద హాస్పిటల్ (Yashoda Hospital)) కి రావడం వల్ల ఇలాంటి ఫోటోలు పెట్టకూడదని ఆ ముగ్గురిని సస్పెండ్ చేసారు యశోదా యాజమాన్యం.

- Advertisement -

ఇక రవితేజనే హెల్ప్ చేయాలి…

అయితే రవితేజ హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ ఫొటోను వైరల్ చేసినందుకు ఆ ముగ్గురు నర్సులను యశోద యాజమాన్యం సస్పెండ్ చేయగా, ఆ ముగ్గురు కన్నీరు మున్నీరవుతున్నారు. ట్రీట్మెంట్ ఇస్తున్న ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ ని షేర్ చేసినందుకు వాళ్ళని సస్పెండ్ చేసారు. కానీ చిన్న తప్పుకు వాళ్ళని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపవుతున్నారు. రవితేజ అయినా వాళ్ళకి జాబ్ ఇప్పించేలా హెల్ప్ చేయాలనీ నెట్టింట డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. మరి దీనిపై చిత్ర యూనిట్ నుండి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు