Devara.. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్ (Jr. NTR)నటిస్తున్న రెండవ చిత్రం దేవర(Devara ). ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం రాబోతోందని తెలిసి అభిమానుల అంచనాలకు అవధులు లేకుండా పోయాయి. సెప్టెంబర్ 27వ తేదీన భారీ అంచనాల మధ్య దేవర చిత్రం విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తూ ఉండగా.. అందులో మొదటి భాగాన్ని వచ్చేనెల విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఇక విడుదల తేదీకి కేవలం నెల రోజులు మాత్రమే వ్యవధి ఉన్న నేపథ్యంలో అప్పుడే ప్రమోషన్స్ చేపట్టారు.
ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అంటూ కొత్త పోస్టర్..
అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. గతంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అంటూ ఎన్టీఆర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అంతేకాదు భారీ అంచనాలు పెరిగిపోవడంతో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఫేసెస్ ఆఫ్ ఫియర్ అంటూ గతంలో వచ్చిన రూమర్స్ నిజం చేస్తూ చిత్ర బృందం వదిలిన పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
టికెట్ బుకింగ్స్ మొదలు..
ఇకపోతే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగా అయితే ఎదురుచూస్తున్నారు ఫస్ట్ షో గురించి కూడా అంతే ఆత్రుతగా చూస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద సంచలనమే క్రియేట్ చేశాయి. మిలియన్ల కొద్ది రీల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి .తండ్రి కొడుకులు సెంటిమెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆరోజు తెల్లవారుజామున 1:08 గంటలకు బెనిఫిట్ షోలు వేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా దాదాపు ఇదే సమయంలో షో పడనుంది. యూకే లో ఇప్పటికే దేవర బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.
తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్..
టికెట్లు దక్కించుకున్న అభిమానులు నెట్టింటే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు కూడా.. ఇకపోతే తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగ వంశీ దక్కించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద సోలో హీరోగా దేవర సినిమా రాబోతోంది.అందుకే బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే ఇక ఈమెకు తెలుగులో తిరుగు ఉండదని చెప్పవచ్చు.
𝐓𝐇𝐄 𝐅𝐀𝐂𝐄𝐒 𝐎𝐅 𝐅𝐄𝐀𝐑 ‼️
In a month, his arrival will stir up the world with an unmissable big screen experience 🔥🔥
Let’s experience his Majestic Madness in theaters on September 27th ❤️🔥#Devara #DevaraOnSep27th pic.twitter.com/IJtvGRCwaa
— Devara (@DevaraMovie) August 27, 2024