Guess The Actors : ఈ ఫొటోలోని వ్యక్తి స్టార్ సింగర్.. ఎవరో గుర్తుపట్టారా?

Guess The Actors : ఈ మధ్య సోషల్ మీడియాలో సెలెబ్రేటీల చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు. డైరెక్టర్స్, సింగర్స్ ఫోటోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకొనే వ్యక్తి లెజండరి సింగర్.. ఈయన భౌతికంగా మన మధ్య లేకపోయిన కూడా ఆయన పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఆ పాటల్లో ఆయన రూపం కనిపిస్తుంది. ఆ సింగర్ యంగ్ గా ఉన్నప్పుడిదే ఈ ఫోటో.. ఎవరో గుర్తు పట్టారా? ఆయన ఎవరో తెలుసుకుందాం..

ఈయన సింగర్ మాత్రమే కాదు.. ఎంతో మంది స్టార్స్ కు డబ్బింగ్ కూడా చెప్పారు. హీరోగా, హీరోలకు తండ్రిగా నటించారు.. ఆయన మరెవ్వరో కాదు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( Balashubramanyam) .. ఈయన ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సాంగ్స్ ను అందించారు. తన గానం అమృతం.. ఎన్నో వేల పాటలకు తన గొంతును అందించారు.. అలాంటి ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా తన పాటలు మన మధ్య ఆయన ఉన్నాడని గుర్తు చేస్తున్నాయి.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన్ను ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అనతి కాలంలోనే మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు..

- Advertisement -
The person in this photo is a star singer.. Do you remember who?
The person in this photo is a star singer.. Do you remember who?

ఇకపోతే 1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి డబ్బింగ్ చెప్పాడు..

ఈయన కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2021లో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అనారోగ్య సమస్యల కారణంగా 2020 సెప్టెంబర్ 25 న స్వర్గస్తులయ్యారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు