Kubera : తమిళదనం లేదు.. ఈ క్లాస్ మూవీ తమిళ తంబీలను మెప్పిస్తుందా..?

Kubera.. తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)ఇటీవల తన స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రంగా తెరకెక్కించిన రాయన్ (Raayan ) విపరీతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఆయన సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు తొలిరోజు అందుకున్న చిత్రంగా నిలిచింది. ఓటీటీ లో కూడా ఈ సినిమా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయంతో మంచి జోష్ లో ఉన్న ధనుష్ ఇప్పుడు కుబేర సినిమాతో త్వరలో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

Kubera : No tamilism... Will this class movie pleasing tamil thambis..?
Kubera : No tamilism… Will this class movie pleasing tamil thambis..?

పవర్ఫుల్ క్యారెక్టర్ లో నాగార్జున..

ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా దాదాపు సగానికి పైగా పూర్తయింది. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇందులో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు వార్తలు చాలా కాలంగా వినిపించాయి. మరి కుబేరలో నాగార్జున అంతకుమించి కనిపిస్తారు అని సమాచారం. ఇదిలా ఉండగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు రివీల్ చేయగా, ప్రేక్షకులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నిజమైన బిచ్చగాడే కుబేర..

ఈ సినిమా చాలా టూ క్లాస్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కుబేరుడు అంటే అత్యంత ధనవంతుడు అని అర్థం. కాని ధనుష్ నటిస్తున్న కుబేర సినిమాలో నిజమైన బిచ్చగాడు అని అర్థం. కుబేర సినిమాలో అడుక్కునే వాడికి 60 కూరలు.. బరువు బాధ్యత లేకుండా ఏ ప్రాబ్లమ్స్ లేనివాడే కుబేర అనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు సాధారణంగా అందరూ డబ్బున్న వాడు కుబేరుడు అనుకుంటారు. కానీ నిజమైన బిచ్చగాడే కుబేరుడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పైగా ధనుష్ ఈ సినిమాలో చాలా టూ క్లాస్ గా కనిపించారు. ఎప్పుడు మాస్ గా ఉండాలి అని ఆలోచించే తమిళ్ అభిమానులకు, ఈ క్లాస్ సినిమా అంటే అందులోనూ ధనుష్ నుంచి క్లాస్ మూవీ అంటే అసలు యాక్సెప్ట్ చేస్తారా.? ఈ సినిమా తెరపైకి వస్తే నిజంగా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

టూ క్లాస్ గా ధనుష్.. తంబీలు ఒప్పుకుంటారా..

సాధారణంగా తమిళ్ ఆడియన్స్ కి మాస్ యాక్షన్ చిత్రాలు అంటే విపరీతమైన ఇష్టం. అలాంటి ప్రేక్షకులు తమ అభిమాన హీరోలు కూడా అలాంటి జానర్లోనే సినిమాలు చేయాలని కోరుకుంటారు. అందులో భాగంగానే ధనుష్ ఇటీవల నటించి దర్శకత్వం వహించిన రాయన్ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి హీరో చేత క్లాస్ మూవీ చేయిస్తే వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు శేఖర్ కమ్ముల అంటే ఫుల్ క్లాస్ సినిమాలు తెరపై కనిపిస్తాయి. ప్రేమలు, టీనేజ్ యువకులతో ఎక్కువగా ఆయన సినిమాలు చేస్తారు. అలాంటి శేఖర్ కమ్ముల మొదటిసారి మాస్ హీరోతో సినిమా చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుంది. ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు