Star Heroine.. భార్యను, బిడ్డలను , తల్లిదండ్రులను బాగా చూసుకున్నవాడు సమాజాన్ని ఉద్ధరిస్తాడు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. అందుకే భార్య అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు.. జీవితానికి పరమార్ధం కూడా. అలాంటి భార్య పైన విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ వారిని చిత్రవదలకు గురిచేస్తూ పెద్దమనుషుల్లా ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. అలాంటి వారిలో ఒక మాలీవుడ్ నటుడు కూడా ఒకరు. ఈయన భార్యను ఎంత చిత్రవధ చేశాడు అంటే కనీసం గర్భంతో ఉంది అని కూడా చూడకుండా ఆమె కడుపుపై తన్నాడు. ఇక ఆ తల్లి ఎంత వేదన అనుభవించిందో మాటల్లో చెప్పలేం. ఇక ఈ విషయాలన్నీ కూడా ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి ఆమె ఎవరు? ఆమె భర్త ఎవరు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
మాజీ భర్త పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి సరిత..
ఆమె ఎవరో కాదు సరిత(Saritha).. పలు చిత్రాలలో నటిగా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె , అంతకుముందు స్టార్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించుకుంది. అవకాశాలు తగ్గే క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయింది. ఈమె భర్త ఎవరో కాదు ప్రముఖ నటుడు ముఖేష్ (Mukhesh) రాజకీయ వేత్త కూడా. 1988లో సరితను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. మొదట్లో బాగానే ఉన్నా రాను రాను ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. అవి కాస్త పెద్దవి కావడంతో 2011 లో విడిపోయారు. ఆ తర్వాత రెండేళ్లకు ముఖేష్ క్లాసికల్ డాన్సర్ అయిన దేవిక (Devika)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2021లో వీరు కూడా విడాకులు తీసుకొని వేరుపడ్డారు. ఇకపోతే వ్యక్తిగతంలో సక్సెస్ కాలేకపోయినా ఈయన రాజకీయంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. సిపిఎం లో కొనసాగుతున్న ఈయన 2016 , 2019 ఎన్నికలలో రెండుసార్లు పోటీ చేసి , ఏకంగా ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఇతడి వక్ర బుద్ధి గురించి ఈయన మొదటి భార్య ప్రముఖ నటి సరిత తెలియజేసిన ఒక వీడియో మళ్లీ వైరల్ గా మారింది.
గర్భవతిని అని కూడా చూడకుండా కడుపుపై తన్నాడు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సరిత మాట్లాడుతూ.. నా మొదటి భర్త క్యారెక్టర్ లేని వాడు. ఎదుటివారికి కొంచెం కూడా గౌరవం ఇచ్చేవాడు కాదు. నన్ను అనునిత్యం కాల్చుకు తినేవాడు. తన తండ్రి ముందే తాగొచ్చి నన్ను కొట్టేవాడు. అంతే కాదు అమ్మాయిలను వెంటవేసుకొని సరాసరి ఇంటికి వచ్చేవాడు. ఆలస్యం ఎందుకు అయింది అని అడిగితే పని వాళ్ళ ముందే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి కొట్టి ఒక చీడపురుగులా నన్ను చూసాడు .ఒకసారి నేను గర్భం దాల్చాను. అది చూడకుండా నా కడుపుపై తన్నాడు. అంటూ సరిత ఎమోషనల్ అయింది.
ఇలాంటి చీడపురుగును ప్రజలు అందలం ఎక్కించారు..
ఇలాంటి ఒక చీడపురుగును సమాజం నమ్మడం, తమనేదో ఉద్దరిస్తాడని అందలం ఎక్కించడం నిజంగా విడ్డూరమే అంటూ వాపోయింది సరిత. మొత్తానికి అయితే ప్రముఖ నటుడు రాజకీయవేత్త పై సరిత చేసిన కామెంట్లు చాలా వైరల్ గా మారుతున్నాయి.