Trisha: ఆ స్టార్‌ హీరో కోసం…దిగజారిపోయిన త్రిష ?

Trisha: టాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ త్రిష (Trisha) ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక కొన్ని రోజులు పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న త్రిష రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. త్రిష ప్రస్తుతం ఆమె లైనప్ లో విశ్వంభర, థగ్ లైఫ్ వంటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తోంది.

అయితే ఈ చెన్నై చిన్నది ఓ సీనియర్ హీరో కోసం ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. అందాల తార త్రిష (Trisha) వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ భామ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ గా నిలబడింది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో నటించింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాలోను నటిస్తూ తన సత్తాను చాటుకుంది. సినిమా విషయాలు పక్కన పెడితే త్రిష (Trisha) ఇండస్ట్రీలో ప్రేమాయణాలు లెక్క లేనంత మందితో నడిపిందని కోలీవుడ్ ఇండస్ట్రీ కోడై కోస్తోంది.

trisha-trisha-joins-in-vishnu-vardhan-salman-khan-movie-the-bull
Trisha doing item song for star hero

కోలీవుడ్ హీరో విజయ్ కి, స్టార్ హీరోయిన్ త్రిషకి మధ్య ఏదో ఉందని టాక్. వీరిద్దరి కాంబినేషన్లో లియో మూవీ వచ్చినప్పటి నుంచి ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక ప్రస్తుతం విజయ్ (Vijay) గోట్ సినిమాలో (Goat) నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో త్రిష ఐటమ్ సాంగ్ చేస్తుందని డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే స్టార్ హీరోయిన్గా అవకాశాలు తగ్గినాక త్రిష దగ్గరికి ఐటం సాంగ్ చేయమని ఎంతోమంది పెద్దపెద్ద దర్శకులు వచ్చారట. కానీ ఎవరికీ కూడా త్రిష ఓకే చెప్పలేదు. అయితే ఫస్ట్ టైం విజయ్ గోట్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందంటే వీరిద్దరి మధ్య ఏదో బలమైన రిలేషన్ ఉందని…. అందుకే ఇప్పటివరకు ఎవరితోనూ ఐటమ్ సాంగ్ చేయని త్రిష ఇప్పుడు విజయ్ సినిమాలో చేయడానికి ఒప్పుకుందంటే సంథింగ్ ఏదో ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక ఇందులో ఇంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు