Gabbar Singh 4k: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్

Gabbar Singh 4k: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదట మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు(Okkadu) సినిమాని రీమాస్టర్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఊహించిన స్థాయిని మించిన రెస్పాన్స్ వచ్చింది. ఒక్కడు ఎటువంటి బ్లాక్ బస్టర్ సినిమా అని మనకి తెలియంది కాదు అటువంటి సినిమాని థియేటర్లో ఎక్సపీరియన్స్ చేయకపోతే ఏదో మిస్ అవుతాం అనే ఫీల్ లో చాలామంది ఆ సినిమాని థియేటర్లో రీ రిలీజ్ లో చూసి బ్రహ్మరథం పట్టారు. ఇక ఆ సినిమా తర్వాత పోకిరి(Pokiri) సినిమాను కూడా అదే రేంజ్ లో ఎంజాయ్ చేశారు. అక్కడ మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.

రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయారు

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాని కూడా బీభత్సంగా ఎంజాయ్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక అప్పటినుంచి ప్రతి హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమాలు రీ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఇక లేటెస్ట్ గా వైజయంతి బ్యానర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో, అలానే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రిలీజ్ చేశారు. ఇంద్ర (Indra) సినిమాకి చేసిన హడావిడి మామూలుది కాదు. చిరంజీవి(Chiranjeevi) కూడా ఈ స్థాయి రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయారు.

గబ్బర్ సింగ్ రీ రిలీజ్

ఇక సెప్టెంబర్ రెండున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బర్త్డే రానున్న సంగతి తెలిసిందే. ఈ బర్తడే సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి కీలకపాత్రను పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్టు లేక పదేళ్లపాటు నిరాశలో ఉన్న ఫ్యాన్స్ అందరికీ గబ్బర్ సింగ్ సినిమా కొత్త జోష్ నింపింది. హరీష్ శంకర్ ను స్టార్ డైరెక్టర్ ను చేసింది గబ్బర్ సింగ్(Gabbar Singh) సినిమా. ఇక్కడితో దర్శకుడుగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు హరీష్.

- Advertisement -

Gabbar Singh

ఆల్ టైం ఇండస్ట్రీ హిట్

ఈ సినిమాని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(Bandla Ganesh) నిర్మించారు. మొదటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీన్మార్ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్ ఆ సినిమాతో హిట్టు కొట్టలేకపోయాడు. ఇక రెండో సినిమా కూడా చేసుకునే అవకాశం నీకే ఇస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు అవకాశం ఇచ్చాడు. గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది. ఇక ప్రస్తుతం ఆ సినిమా రీ రిలీజ్ కు నా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు నేను కూడా వస్తాను అని అనౌన్స్ చేశాడు గణేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు