KA Movie: హీరోయిన్ పబ్లిసిటీ పీస్ యేనా.. కథలో ప్రాధాన్యత లేదా..?

KA Movie.. ఆంధ్రప్రదేశ్ కుర్రాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం క (KA) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కిరణ్ అబ్బవరం. సుజిత్ అండ్ సందీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని స్వయంగా కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్, టీజర్, సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ విడుదల చేశారు నిర్వాహకులు, వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో వదలగా , పల్లెటూరి వాతావరణంతో ఈ సాంగ్ చాలా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

KA Movie: Is the heroine a publicity piece? Is there no priority in the story?
KA Movie: Is the heroine a publicity piece? Is there no priority in the story?

రెండు షేడ్స్ లో కిరణ్ అబ్బవరం..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో హీరో కిరణ్ పోస్ట్ మాన్ గా కనిపించనున్నారు. పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది..హీరో క్యూరియాసిటీ క్యారెక్టర్ ను టీజర్ తో పరిచయం చేశారు. ఇందులో కిరణ్ రెండు షేడ్స్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.” నాకు తెలిసిన నేను మంచి.. నాకు తెలియని నేను.. అనే డైలాగ్ తో హీరో క్యారెక్టర్ పై ఆసక్తి పెంచేశారు. పెద్దగా VFX , సీజీ వర్క్స్ జోలికి పోకుండా సింపుల్ గా కథను ముగిసినట్లు తెలుస్తోంది.

అసలు హీరోయిన్ ఎవరు..

ఇకపోతే సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే హీరోయిన్ కి కచ్చితంగా ఒకింత వాల్యూ ఉంటేనే లేక పాత్రకు తగిన గుర్తింపు ఉంటేనే నటించడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ సినిమాలో చూస్తుంటే అసలు హీరోయిన్ వుందా.. అసలు ఉంటే ఎక్కడ..అనే సందేహం కలుగుతుంది. అయితే ఇందులో చూడడానికి ఒక అమ్మాయి రహస్య గోరక్ లాగా ఉంది కానీ ఇందులో ఎవరు నటిస్తున్నారు అనే విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. దీనికి తోడు అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఉన్నా లేనట్టే అన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

హీరోయిన్ కేవలం ప్రమోషన్ పీస్ యేనా..

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. పోస్ట్మాన్ నేపథ్యంలో జరిగే కథ అన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాలు చదివి వచ్చే సమస్యలను తీర్చడమే హీరో లక్ష్యం అన్నట్లు సమాచారం. పూర్తిగా ఈ సినిమాలో హీరోయిన్ కి ప్రాధాన్యత లేదు అని తెలుస్తోంది. కేవలం హీరోయిన్ ను పబ్లిసిటీ స్టంట్ కోసమే వాడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ కూడా హీరోయిన్ కి స్కోప్ లేదు.. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ , కనీసం టీజర్ లో కూడా రివీల్ చేయలేదు. ఇప్పటి వరకు ఆమె ఎవరు అన్న విషయం కూడా చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే కేవలం ప్రమోషన్స్ కి మాత్రమే హీరోయిన్ వస్తుందని అందుకోసమే ఈ సినిమాలో ఆమెను పెట్టారేమో అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాలో హీరోయిన్ ప్రమోషన్ పీస్ అని, అసలు ఈమెకు ప్రాధాన్యత లేదన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు