Nagarjuna: N- కన్వెన్షన్ కూల్చివేత.. చైతూ స్పందన వింటే షాక్..!

Nagarjuna.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున (Nagarjuna)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, వాక్చాతుర్యంతో, సహాయ సహకారాలతో ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకోవడమే కాదు వరుస చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు.

Nagarjuna: N-Convention demolition.. Shocked to hear Chaitu's response..!
Nagarjuna: N-Convention demolition.. Shocked to hear Chaitu’s response..!

ఇకపోతే బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతున్నారు. సుమారుగా ఈయన ఆస్తి విలువ రూ.3 వేల కోట్ల పైమాటే అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా తాజాగా నాగార్జునకు అత్యంత ఆదాయాన్నిచ్చే వనరులలో ఎన్ కన్వెన్షన్ కూడా ఒకటి. దీనిని తెలంగాణ ప్రభుత్వం హైడ్రా చేత కూల్చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు..ఎన్ కన్వెన్షన్ లో ఉన్న రెండు పెద్ద హాళ్ల ను కూల్చివేయడమే కాకుండా తుమ్మిడి కుంట చెరువులో ఉన్న మూడున్నర ఎకరం కబ్జా చేసి కన్వెన్షన్ కట్టారని ఆరోపణలు కూడా చేశారు. అందుకే కూల్చి వేసినట్లు సమాచారం.

నాగార్జున కబ్జా చేశారంటూ ఆరోపణలు..

దీనికి తోడు నోటీస్ కూడా ఇవ్వకుండానే కూల్చివేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున, వెంటనే సోషల్ మీడియాలో స్పందించారు . అంతేకాదు హైకోర్టును కూడా ఆశ్రయించి స్టేట్ తెచ్చుకున్నారు .అయితే అంతలోపే ఎన్ కన్వెన్షన్ లోని రెండో హాళ్లను హైడ్రా పెద్దపెద్ద బుల్డోజర్లను ఉపయోగించి కూల్చివేసింది. ఇక త్వరలోనే అన్ని నిజాలు బయటకి వస్తాయని, కావాలని అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగార్జున. అంతేకాదు దీనిపై కొంతమంది నాయకులు ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ నాగార్జున పై విమర్శలు చేశారు. అయితే దీనిపై తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya)స్పందించారు.

- Advertisement -

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై నాగచైతన్య స్పందన..

తాజాగా నాగచైతన్య హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఒక వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి విచ్చేశారు.. ఈ నేపథ్యంలోనే ఆయనను మీడియా ప్రశ్నించింది. ఎన్ – కన్వెన్షన్ కూల్చివేత పై స్పందించాలని అడగగా, నాగచైతన్య స్పందిస్తూ.. ఆ విషయం ఇప్పుడు వద్దు.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి నాన్న ట్విట్టర్లో అన్ని వివరాలు తెలిపారు అంటూ చెప్పేశాడు. మొత్తానికి అయితే ఈ విషయంపై నోరు మెదపకుండా పక్కకు తప్పుకున్నారు నాగచైతన్య. పెళ్లిపై త్వరలో క్లారిటీ..

అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ.. డెస్టినేషన్ లేదా హైదరాబాదులోనే మీ పెళ్లి జరుగుతుందా అని ప్రశ్నించగా.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.. ఎక్కడ? ఎప్పుడు? జరుగుతుందో త్వరలోనే అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ తెలిపారు నాగచైతన్య. చైతన్యకు ఒక వింతైన ప్రశ్న వేస్తూ.. మీరెందుకు ఇటీవలే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు అని అడగగా.. , బహుశా నన్ను ఎక్కువ చూపిస్తున్నారు కావచ్చు అంటూ తెలిపారు. అలాగే సినిమా తండేల్ గురించి కూడా ప్రశ్నించగా.. ప్రస్తుత లుక్ తండేల్ కోసమే అంటూ తెలిపారు. తండేల్ నిజమైన కథ ఆధారంగా తెరకెక్కుతోందని తెలిపారు నాగచైతన్య. దీంతో చైతు చెప్పిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు