Jacqueline fernandez: చేతిలో సినిమాలే లేవు..ప్రైవేట్ ఐలాండ్ కొనేసింది ?

Jacqueline fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline fernandez) మోడల్ గా గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. చిన్న చిన్న సినిమాల నుంచి ఏకంగా స్టార్ హీరోలు సరసన నటించే అవకాశాలను అందుకుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హిందీ సినిమాల్లో తన అంద చందాలతో ఓ ఊపు ఊపిస్తోంది. ఈ భామ శ్రీలంకలోని పశ్చిమ ప్రావిన్స్ కోలంబోలో జన్మించింది. జాక్వెలిన్ 2006లో మాజీ మిస్ శ్రీలంక యూనివర్సిటీ అందాల కిరీటాన్ని కైవసం చేసుకుంది.

ఇదిలా ఉండగా… ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2011-16 సంవత్సరం వరకూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. మర్డర్ 2, హౌస్ ఫుల్ 2, రేస్ 2 వంటి సినిమాలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు (Jacqueline fernandez) మంచి ఇమేజ్ ను సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత ఈ బ్యూటీ మరికొన్ని సినిమాలు చేసింది. తనకు వచ్చిన రెమ్యూనరేషన్ తో శ్రీలంక దేశంలో (Srilanka) ఏకంగా ఐలాండ్ ను కొనుగోలు చేసింది. జాక్వెలిన్ సొంత దేశం శ్రీలంక. 2012లో అక్కడ ఓ ప్రైవేట్ ఐలాండ్ కొనుగోలు చేసింది.

jacqueline-fernandez-Sukesh Chandrasekhar Writes New Love Letter To Jacqueline Fernandez
Jacqueline

అప్పట్లో దాని విలువ చాలా తక్కువ. కేవలం మూడు కోట్లకే కొనుగోలు చేసింది. వరుసగా సినిమాలన్నీ హిట్ అవుతున్న సమయంలో ఐలాండ్ ను కొన్నారు. ఈ ప్రైవేట్ ద్వీపంలో అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడిన భవనాన్ని నిర్మించాలా? ఉండడానికి ఇల్లుగా ఉపయోగించుకుందామా? లేదంటే వాణిజ్య సముదాయంగా నిర్మిద్దామా? అనే విషయంపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇలా ప్రైవేట్ ఐలాండ్ కొనుగోలు చేయడం మంచిదేనని…. దీన్ని ఎలాంటి అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు