Mollywood Actress.. మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందన్న విషయం జస్టిస్ హేమా (Justice Hema) నివేదిక బయటకు వచ్చిన తర్వాత అర్థమయింది. ముఖ్యంగా చాలామంది నటులు ఆడవారిని అక్కడ ఇబ్బంది పెడుతున్నారని , అవకాశం రావాలంటే వారి కోరిక తీర్చాలని డిమాండ్ చేస్తున్నారట. అందుకే ఆ డిమాండ్స్ తట్టుకోలేక చాలామంది మలయాళ ఇండస్ట్రీ నుంచి పక్క చూపులు చూస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి.తోడు జస్టిస్ హేమా కమిటీ విస్తుపోయే నివేదికను బయటపెట్టింది. ఇందులో లైంగిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , ఆడవారికి పని ప్రదేశాల్లో రక్షణ లేకుండా పోతుందంటూ జస్టిస్ హేమ తెలిపింది.
నాపై కోపిష్టి అని ముద్ర వేసి.. అవకాశం ఇవ్వలేదు..
ఇక ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ బాధలను చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక సీనియర్ నటి ఉషా కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అప్పుడు అలా జరగడం వల్లే అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డానని , కనీసం ఛాన్స్ కూడా ఎవరు ఇవ్వలేదంటూ ఆమె తెలిపింది.
మిస్ బిహేవ్ చేయడంతో చెంప పగలగొట్టా..
సీనియర్ నటి ఉషా మాట్లాడుతూ.. 1992లో జరిగిన ఒక విషయం గురించి చెప్పుకొచ్చింది. లిఫ్టులో ఒక సీనియర్ నటుడు నాతో తప్పుగా ప్రవర్తించారు. చాలామంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని నన్ను ప్రశ్నించవచ్చు. కానీ అప్పుడే నేను దాని గురించి మాట్లాడాను. దానివల్ల నేను ఎన్నో సినిమా అవకాశాలు కోల్పోయాను. అయితే ఇప్పుడు జస్టిస్ హేమ కమిటీ ప్రవేశపెట్టిన నివేదిక బయటకు వచ్చిన తర్వాత నా అనుభవాన్ని పంచుకుంటున్నాను అంటూ ఆమె తెలిపింది. బెహ్రైన్ లో ఒక ఈవెంట్ జరగగా.. ఆ ఈవెంట్ కి నేను వెళ్లాను. అక్కడ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణం అవ్వాలి. అందరం అలసిపోయాము లగేజ్ అంత తీసుకొని లాభీ లోకి వస్తే కబుర్లు చెప్పుకోవచ్చు అని మోహన్ లాల్ (Mohan Lal) చెప్పడంతో అందరూ అక్కడికి వస్తున్నాం. అప్పుడు ఒక సీనియర్ యాక్టర్ దగ్గరకు వచ్చి.. అయితే ప్రస్తుతం ఆయన చనిపోయాడు లేండి.. అప్పుడు నా దగ్గరకు వచ్చి నాతోపాటు కిందకి వస్తానని లిఫ్ట్ ఎక్కాడు. ఎక్కిన వెంటనే నాతో మిస్ బిహేవ్ చేశాడు. వెంటనే లాగి లెంపకాయ కొట్టాను అంటూ తెలిపింది. ఆ సమయంలో నాతో పాటు వచ్చిన మోహన్ లాల్ , రేవతి , సుకుమారి, మౌనిష వచ్చారు.
మోహన్ లాల్ కి చెప్పగా..
ముందుగా సుకుమారి నన్ను చూసి ఏం జరిగిందని చెబితే నేను జరిగింది మొత్తం చెప్పాను. ఆమె ఆ విషయం మోహన్ లాల్ కి చెబితే ఆయన మంచి పని చేశారు అంటూ నాతో అన్నారు. అయితే అదే విషయాన్ని అప్పుడు అసోసియేషన్ కి కూడా చెబితే నాపై రివర్స్ వేసి , నన్ను కోపిష్టి అని ముద్ర వేసి అవకాశాలు రాకుండా చేశారు. ఎవరు నాతో పని చేయను అని చెప్పారు అంటూ నాటి అనుభవాలు పంచుకుంది ఉష. ఇకపోతే మాలీవుడ్ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో అమ్మ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్. కమిటీ మెంబర్స్ పైన ఆరోపణలు రావడం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.