Janasena Leader.. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు అల్లు వర్సెస్ మెగా అన్నట్టుగా మారిపోయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun) ఏం చేసినా సరే మెగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం మనం గమనించాము. అయితే ఇప్పుడు అభిమానులతో ఆగలేదు మెగా హీరోలే కాదు జన సేన నాయకులు కూడా అల్లు అర్జున్ పై విరుచుకుపడుతూ ఆయనను చిత్రవధ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరొక జనసేన లీడర్.. నువ్వు ఒక పెద్ద కమెడియన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయన కాళ్లు మొక్కకపోతే నువ్వు నటించిన పుష్ప 2 చిత్రాన్ని ఆపేస్తామంటూ బెదిరించారు కూడా.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వాళ్ల కాళ్లు కడిగి నీ నెత్తిన చల్లుకో..
తాజాగా జనసేన లీడర్ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు (Chalamala shetty Ramesh Babu) అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ నువ్వు ఏమైనా హీరో అనుకుంటున్నావా.. కాదు నువ్వు ఒక కమెడియన్ వి..చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నాగబాబు (Nagababu) అండ చూసుకొని నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి అసలు నీకు లేదు. చిరంజీవి అంటే ఇండస్ట్రీలో మహావృక్షం. ఎన్నో సంఘ సేవలు, బ్లడ్ బ్యాంక్ నిర్వహణ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించిన మహానీయుడు . ఆయన నీడ ఇచ్చే చెట్టు. ఆ నీడని పొంది ఇప్పుడు నువ్వు ఆయనపై విమర్శిస్తున్నావు.
అసలు నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం..
నువ్వే కాదు మీ నాన్న కూడా పిల్లికి కూడా భిక్షం వెయ్యరు. తొందర్లో చిరంజీవి , పవన్ కళ్యాణ్ , నాగబాబు కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరిపోదు. డిసెంబర్ నెలలో మీ సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో నేను నీకు చూపిస్తాను. కనీసం నీ ఫ్లెక్సీలు కూడా కట్టే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అంటూ సంచలన కామెంట్లు చేశారు. నిజానికి అల్లు అర్జున్ కి , మా పార్టీకి ఎటువంటి శత్రుత్వం లేదు. అతడు మొన్న మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టే నేను ఈరోజు అనాల్సి వచ్చింది అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బెదిరింపులకు అల్లు అర్జున్ భయపడతారా..
ఇకపోతే అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో పుష్ప సీక్వెల్, పుష్ప 2(Pushpa 2) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను మేము అసలు మా ఏరియాలో విడుదల కానివ్వము అంటూ జనసేన నాయకులు బెదిరిస్తున్నారు. మరి ఇలాంటి బెదిరింపులకు తట్టుకొని అల్లుఅర్జున్ ఎలా నిలబడగలరు అనే విషయం అభిమానులలో ఆందోళనను కలిగిస్తోంది. మరొకవైపు తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరి అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.