GabbarSingh4k : గబ్బర్ సింగ్ కోసం ప్రెస్ మీట్.. చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు బండ్ల గణేష్..

GabbarSingh4k : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) నటించిన “గబ్బర్ సింగ్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ కి పదేళ్ల తర్వాత నిఖార్సైన హిట్ ఇచ్చి టాలీవుడ్ లో పలు రికార్డులు తిరగరాసిన సినిమా ఇది. మెగాభిమానులకు ఫేవరేట్ సినిమాల్లో ఈ సినిమా ముందుంటుంది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా, తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా గబ్బర్ సింగ్ (GabbarSingh4k) సినిమా సెప్టెంబర్ 2న అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఇప్పట్నుంచే ప్రీ రిలీజ్ బుకింగ్స్ లో అడ్వాన్స్ సేల్స్ లో కోటిన్నర వసూళ్లు సాధించడం విశేషం. ఇక రీ రిలీజ్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

The makers of Gabbar Singh are holding a press meet on August 31

గబ్బర్ సింగ్ కోసం ప్రెస్ మీట్.. బండ్ల గణేష్ మీడియా ముందుకు..

అయితే గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ అవుతున్న సందర్బంగా గబ్బర్ సింగ్ కోసం ప్రెస్ మీట్ పెడుతున్నట్టు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేసారు. గబ్బర్ సింగ్ ప్రెస్ మీట్ ను ఆగష్టు 31న ఉదయం 11 గంటలకు మీడియా ముందుకు రానున్నట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక ఈ సినిమాను బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈ నిర్మాత గత కొంతకాలంగా మీడియాకి, సినిమాలకి కూడా దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు గబ్బర్ సింగ్ విడుదల నేపథ్యంలో చాలా కాలం తరువాత ఫిల్మ్ మీడియా ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ (Bandla ganesh) స్పీచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫిల్మ్ వర్గాలు.

- Advertisement -

గబ్బర్ సింగ్ అన్ని లెక్కలు తెలుస్తాడా?

ఇక టెంపర్ సినిమా తర్వాత మళ్ళీ సినిమా ప్రొడ్యూస్ చేయని బండ్ల గణేష్ సినిమాల్లో అడపా దడపా గెస్ట్ అప్పీరెన్స్ లు తప్ప, ఇండస్ట్రీక్ దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ సినిమా తీస్తానని అని పలుమార్లు చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. మరి ఆగష్టు 31న ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్ సినీ రాజకీయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి. ఇక గబ్బర్ సింగ్ సినిమా ఇప్పటికే బుకింగ్స్ పరంగా కోటిన్నర మార్క్ క్రాస్ చేయగా, రీ రిలీజ్ రోజు భారీ వసూళ్లు అందుకునే ఛాన్స్ కనిపిస్తుంది. మరి గబ్బర్ సింగ్ సెప్టెంబర్ 2న రీ రిలీజ్ రోజున ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు