Siddharth – Aditi: లవ్ ప్రపోజల్ పై నోరు విప్పిన అదితి.. పెళ్లి అక్కడే అంటూ క్లారిటీ..!

Siddharth – Aditi.. ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు.. ఎవరితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటారో చెప్పడం అసాధ్యం. ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకొని.. కొత్త బంధం వెతుక్కొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన జంటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి జంటల్లో సిద్ధార్థ్ (Siddharth ), అదితి రావు హైదరీ (Aditi Rao hydari)కూడా నిలవబోతున్నారు. వీరిద్దరూ కలిసి మహాసముద్రం(Maha Samudram) సినిమాలో నటించారు . అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.

Siddharth - Aditi: Aditi opened her mouth on the love proposal.
Siddharth – Aditi: Aditi opened her mouth on the love proposal.

రూమర్స్ నిజం చేసిన జంట..

ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని, ఆ స్నేహమే ప్రేమగా మారి పెళ్లికి దారితీస్తోందని వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి తోడు మహాసముద్రం సినిమా షూటింగ్ తర్వాత వీరిద్దరూ కలిసి చట్టపట్టలేసుకొని వెకేషన్ లకి వెళ్లడం , మీడియా ముందు కనిపించడం లాంటివి చేశారు . పైగా శర్వానంద్ పెళ్లిలో కూడా ఈ జంట సందడి చేసింది.. ఇలా ఎక్కడ చూసినా సరే వీరిద్దరూ జంటగా కనిపించేసరికి రూమర్స్ గుప్పుమన్నాయి. ఇక ఇప్పుడు ఆ రూమర్స్ నిజం చేస్తూ ఒకటి కాబోతున్నారు.

వెరైటీ పెళ్లి ప్రపోజల్..

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి రావు హైదరి తమ ప్రేమ విషయంలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు అనే విషయాన్ని చెబుతూనే.. తమ పెళ్లి ఎక్కడ జరగబోతోంది అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది.. తాజాగా అదితి రావు హైదరి మాట్లాడుతూ.. ఒకసారి నేను మా అమ్మమ్మ కట్టించిన స్కూల్ కి సిద్ధార్థ ను తీసుకెళ్లాను. అయితే అక్కడే అతడు నాపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. అక్కడికి వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి సడన్ గా నా ముందు మోకరిల్లాడు. నేను ఏమైంది .. ఇక్కడ మీరు ఏం వెతుకుతున్నారు.. అంటూ ప్రశ్నించాను. వెంటనే ఆయన నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఇక దాంతో నేను కూడా ఒప్పుకున్నాను అంటూ తమ వెరైటీ పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చింది.

- Advertisement -

400 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడిలో పెళ్లి..

ఇకపోతే తెలంగాణలోని వనపర్తి లో ఉన్న 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీరంగాపూర్ రంగనాథ దేవాలయంలో తమ పెళ్ళి జరగబోతోంది అంటూ క్లారిటీ ఇచ్చింది అదితి రావు హైదరి. నిజానికి మార్చిలోనే వీరిద్దరి పెళ్లి ఈ వనపర్తి లో జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు అదే గుడిలో వివాహం జరగబోతోంది అంటూ అదితి చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా మీడియాలో వచ్చే వార్తలు నిజం అంటూ ఎప్పటికప్పుడు ఇలాంటి సెలబ్రిటీలు రుజువు చేస్తున్నారని చెప్పవచ్చు.

ఇద్దరికీ రెండో వివాహమే..

ఇకపోతే గతంలో సిద్ధార్త్ మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 2007లో మనస్పర్ధల కారణంగా విడిపోయారు. అలాగే అదితికి కూడా ఇది రెండో వివాహమే. గతంలో సత్యదీప్ మిశ్రా తో వివాహం జరగగా, కొన్ని రోజులకే అనగా 2012లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. ఇక అదితి విషయానికి వస్తే.. వనపర్తి సంస్థానాదీశుల వారసులలో ఒకరైన ఈమె, ఆ సంస్థానానికి చెందిన దేవాలయంలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు