Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కార్ గిఫ్ట్ ఇస్తానని మోసం చేసిన ప్రొడ్యూసర్.. చిరు తండ్రికి నచ్చలేదు దాంతో?

Chiranjeevi : స్వయంకృషితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తి “మెగాస్టార్ చిరంజీవి”. నాలుగు దశాబ్దాలుగా నెంబర్ వన్ గా తెలుగు చిత్ర పరిశ్రమని ఏలిన చిరంజీవి, రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ తనదైన శైలిలో అలరిస్తున్నాడు. చిరంజీవి అనే మహావృక్షం నుండి ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్లు పుట్టుకొచ్చారు. ఒక్క మెగా ఫ్యామిలీ నుండే ఏటా వందల కోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అంతటి ఖ్యాతి గడించిన చిరంజీవి (Chiranjeevi) కెరీర్ బిగినింగ్ లో సినిమాల్లో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన నటించిన ఓ పది సినిమాల తర్వాతగాని కెరీర్ లో మంచి హీరోగా బ్రేక్ రాలేదు. ఈ క్రమంలో చిరంజీవికి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Chiranjeevi bought the first car in his life

చిరంజీవికి కార్ గిఫ్ట్ ఇస్తానన్న నిర్మాత..

అయితే చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో హీరోగా బ్రేక్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడని తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, విలన్ గా కూడా సినిమాలు చేసారు. ఈ క్రమంలో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా “ఐ లవ్ యు” (I Love You) అనే సినిమా కూడా చేసాడు. అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలో చిరంజీవిని చూసి ఆ సినిమా నిర్మాత ఎస్. కుమార స్వామి (S. Kumaraswamy) ఇలా అన్నాడట.. చిరుని ఓ సీన్ బాగా చేసినందుకు ప్రశంసిస్తూ,.. “బాగా చేశావయ్యా, సినిమా మొత్తం బాగా నటిస్తే.. నీకు నా “ఫియట్ కార్” గిఫ్ట్ గా ఇస్తా” అని చిరుకి మాట ఇచ్చారట. ఇక పెద్ద ప్రొడ్యూసర్ మాట ఇచ్చేసరికి, చిరు బాగా కష్టపడి, రచయిత గొల్లపూడి మారుతీరావు తో స్పెషల్ గా డైలాగ్స్ లో కూడా మెళకువలు నేర్చుకుని సినిమాలో నటించాడట చిరంజీవి. తీరా చూస్తే చిరుతో ఆ నిర్మాత మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకురాలేదట.

- Advertisement -

కోపంతో చిరు నాన్న ఏం చేసారంటే?

అయితే చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఐ లవ్ యు సినిమాలో బాగానే నటించానని, ఈ విషయం తన తండ్రి దగ్గర కూడా చాలా సార్లు చెప్పి సంతోష పడ్డానని, కానీ నిర్మాత కుమార స్వామికి నచ్చలేదేమోనని, అందుకే కార్ ఇవ్వలేదని అంటూ… చిరు తాను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చాడు. అయితే నిర్మాత తీరు నచ్చని చిరంజీవి నాన్న కోపంతో, అప్పటికప్పుడు నిర్మాత దగ్గరున్న అదే మోడల్ కార్ నే కష్టమైనా సరే కొని, కార్ ని చిరంజీవికి గిఫ్ట్ గా ఇచ్చాడట. తన లైఫ్ లో తన సొంతమైన ఫస్ట్ కార్ అదేనని చిరంజీవి అంటూ.. కార్ మోడల్ “FIAT AAN2087” అని (Copper Sulphate Blue color) కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో కార్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ కార్ తర్వాత చిరు స్వయంగా మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన మారుతీ 800 కార్ కొన్నాడట. అది చిరు కొన్న రెండో కార్. ఇక ప్రస్తుతం ఈ కార్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉందని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు