Arjundas : ఆగలేకపోతున్నా.. FDFS మీ అందరితో కలిసి చూస్తా- అర్జున్ దాస్

Arjundas : OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “OG” సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెట్స్ పై దీనికంటే ముందు మొదలెట్టిన రెండు సినెమాలున్నా, ఓజి పైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఓజి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక సాహో ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే అనూహ్యాంగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం చేత అన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) భారీ మెజార్టీతో గెలవడం, ఏకంగా డిప్యూటీ సీఎం కూడా కావడం జరిగింది. ఇక సినిమాల్లో పవన్ రాక కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Arjundas interesting comments about OG movie

ఆగలేకపోతున్నా.. FDFS మీతోనే చూస్తా – అర్జున్ దాస్..

ఇక ఓజి (OG) సినిమా కోసం అభిమానులే కాదు, సినీ సెలెబ్రిటీలు సైతం ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని వింటేజ్ లుక్స్ లో పవర్ ఫుల్ గా సుజీత్ చూపిస్తున్నాడని టీజర్ లో తెలిసిపోయింది. ఇక రీసెంట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఈవెంట్లలో ఓజి అప్డేట్ ని దర్శక నిర్మాతలని అడుగుతూనే ఉన్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా సరిపోదా శనివారం ఈవెంట్స్ లో నిర్మాత దానయ్యని (DVV Danayya) ఎంతలా ఓజి అప్డేట్ కోసం బతిమిలాడారో తెలిసిందే. ఇదిలా ఉండగా విలక్షణ నటుడు అర్జున్ దాస్ (Arjundas) తాజాగా ఓజి సినిమా కోసం తాను కూడా ఆగలేకపోతున్నానని ట్వీట్ చేసారు. సరిపోదా శనివారం థియేటర్లో ఓజి టీజర్ కూడా వేస్తుండగా, ఆ థియేటర్లో టీజర్ ని ఓ అభిమాని అర్జున్ దాస్ కి ట్యాగ్ చేసాడు. దానికి అర్జున్ దాస్ రిప్లై ఇస్తూ.. ఇలా చెప్పుకొచ్చాడు. ఓజి కోసం తాను కూడా ఆగలేకపోతున్నాని, ఓజి ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులతోనే సంధ్య లేదా సుదర్శన్ థియేటర్లో చూస్తానని ట్వీట్ వేసాడు. ఇక ఓజి సినిమాలో నటిస్తున్న అర్జున్ దాస్, టీజర్ కి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడని తెలిసిందే.

- Advertisement -

వైజాగ్ లో ఓజి షెడ్యూల్..

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న బిజీ వల్ల ఓజి సెట్స్ లో అనుకూలంగా పాల్గొనడానికి విజయవాడ, అలాగే వైజాగ్, పిఠాపురం సరిహద్దు ప్రాంతాల్లోనే షూట్ కూడా చేయనున్నారు మేకర్స్. ఇక ఓజి ఈ ఇయర్ వచ్చే అవకాశమైతే లేదు. బహుశా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఓజి ని ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక ఓజి లో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka arul mohan) హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రానున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు