Ajith : థలా ఊహించని సాహసం.. ఇలాంటివి ఇన్స్పైర్ అయితే ఏంటి పరిస్థితి?

Ajith : కోలీవుడ్ స్టార్ థలా “అజిత్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడు లో రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో స్టార్ డమ్ ఉన్న అజిత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా అజిత్ హీరో కాక ముందే ఒక “బైక్ రేసర్” అని తెలిసిందే. పలు ఇంటర్నేషనల్ రేసింగ్ గేమ్స్ లో కూడా అప్పట్లో పాల్గొన్నాడు. అయితే హీరో అయ్యాక దాన్ని పక్కన బెట్టేసినా, ఆఫ్ లైన్ లో ఎప్పుడు ఛాన్స్ దొరికినా, బైక్, లేదా కార్ ని వేసుకుని ట్రావెల్ చేస్తాడు. ఒక్కోసారి సెక్యూరిటీ కూడా లేకుండా హెల్మెట్ వేసుకుని అజిత్ బయట తిరిగిన రోజులున్నాయి. ఇక కొన్ని నెలల కింద అజిత్ (Ajith) విదా ముయార్చి షూటింగ్ కోసం చెన్నై నుండి హైదరాబాద్ కి బైక్ ఫై వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అజిత్ కార్ డ్రైవ్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట సంచలనం రేపుతోంది.

Thala Ajith drove the car at a speed of 234 km

థలా సాహసం.. 234 కిలోమీటర్ల వేగం..

ఇక థలా అజిత్ కుమార్ (Ajith) కు రేస్ అంటే ఎంత ఇష్టమో కొన్ని సార్లు తాను పోస్ట్ చేసే వీడియోలని చూస్తేనే తెలుస్తుంది. అతను గతంలో ఫార్ములా ఆసియా, మరియు ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌ (Formula2 championship) లలో పాల్గొన్న ఒక ప్రొఫెషనల్ అజిత్. అయితే తాజాగా అజిత్ అత్యంత వేగంతో నడుపుతున్న ఓ కార్ డ్రైవ్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో అజిత్ ఏకంగా గంటకు 234 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇలాంటి రిస్కీ రేస్ లో అజిత్ గతంలో చేసినా, ఇప్పుడు వీడియో వైరల్ అవుతుండడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఇంత రిస్క్ అవసరమా? ఫ్యాన్స్ ఇన్స్పైర్ అయితే?

అయితే ఈ వీడియోలో అజిత్ కూల్ గానే కనిపిస్తున్నా, వేగంగా నడపాలనే ఆతృతతో ఉన్నట్టు తెలుస్తుంది. అది ఒక ‘ఆడి కార్, అని సమాచారం. అయితే అజిత్ ఇంత వేగంగా నడుపుతూ రిస్క్ చేయడం అజిత్ ఫ్యాన్స్ కి కూడా నచ్చడంలేదని సమాచారం. ఒకప్పుడు అజిత్ రేసర్ అయినా, ఇప్పుడు ఎంతో మంది ఫ్యాన్స్ కి ఆరాధ్యుడు. ఇంత స్టార్ డమ్ ఉన్న హీరో ఇప్పుడు ఇలాంటి లైఫ్ రిస్క్ లు చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ వస్తున్నాయి. అన్నిటికీ మించి అజిత్ ఇంత స్పీడ్ గా డ్రైవింగ్ చేయడం చూసి కొందరు ఫ్యాన్స్ ఫిదా అయినా, ఒకవేళ ఇలాంటి వీడియోలని ఇన్స్పైర్ అయ్యి, రేసుల పేరిట ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేస్తే పరిస్థితేంటి అని ట్రేడ్ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై అజిత్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఇక ప్రస్తుతం అజిత్ నటిస్తున్న విదా ముయార్చి (Vidaa Muyarchi) అక్టోబర్ 31న విడుదలకు రెడీ అవుతుంది. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” 2025 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు