Balakrishna: ఆమె లేకపోతే బాలయ్య ఇంత సక్సెస్ అయ్యే వారు కాదా..?

Balakrishna..తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబం (Nandamuri family)నుంచి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోలలో బాలయ్య కూడా ఒకరు. సీనియర్ నటుడు గానే కాకుండా, రాజకీయ నేతగా, ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణ సినీ కెరియర్ మొదలుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా వాళ్లు బాలకృష్ణకు చాలా గ్రాండ్గా ఈ రోజున సన్మానిస్తున్నారు. అయితే బాలయ్య ఈ స్థాయిలో ఎదగడానికి ముఖ్య కారణం ఒక మహిళనట. మరి ఆ మహిళ ఎవరో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

Balakrishna: Balayya wouldn't have been so successful without her..?
Balakrishna: Balayya wouldn’t have been so successful without her..?

బాలయ్య కోసం అన్నీ వదిలేసుకున్న వసుంధర..

బాలకృష్ణ అటు ఇండస్ట్రీలో కానీ ఇటు రాజకీయాలలో కానీ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఆయన భార్య వసుంధర (Vasundhara) పాత్ర ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన భర్త కోసం వసుంధర ఒక గొప్ప త్యాగాన్ని కూడా చేసిందట. అదేమిటంటే వసుంధర బాలకృష్ణ భార్య అయినప్పటికీ కూడా తనకు ఒక గుర్తింపు రావాలని అందుకోసం ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకుందట. కానీ బాలకృష్ణతో వివాహమైన వెంటనే.. కొన్ని నెలలకే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో తన కోరికలను సైతం వదిలేసుకుందట. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత.. తన సమయాన్ని మొత్తం ఎక్కువగా వారి ఆలనా పాలన చూసుకునేందుకే కేటాయించిందట.

ఆమె వల్లే బాలయ్య సక్సెస్..

అలా ఒకవైపు బాలయ్య బాధ్యతలను , పిల్లల బాధ్యతలను చూసుకోవడంతో బాలయ్య ఎక్కువగా సినిమాలు మీద ఫోకస్ పెట్టడం జరిగిందట. ఒకానొక సమయంలో బాలయ్యకు వరుసగా ప్లాపులు ఎదురైన సమయంలో కూడా వసుంధర ధైర్యం చెప్పి మరీ సపోర్టు చేసిందట. అలా బాలకృష్ణ మళ్లీ తిరిగి కం బ్యాక్ ఇచ్చి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లను ఎప్పుడు అందుకుంటున్నారు. అంతేకాకుండా తన భర్తకు లక్కీ వైఫ్ గా కూడా మారిపోయింది. బాలయ్య సక్సెస్ లో కూడా వసుంధర భాగమైంది.

- Advertisement -

బాలయ్యకు సపోర్టుగా భార్య..

బాలకృష్ణను అన్ స్టాపబుల్ షోకి వెళ్లడానికి చాలా సపోర్ట్ చేసింది వసుంధర.. మొదట హోస్టుగా అంటే బాలయ్య కూడా కాస్త అనుమానపడ్డారని.. చాలామంది ట్రోల్ చేస్తారేమో అని వెనుకడుగు వేశారట. కానీ వసుంధరకు ధైర్యం చెప్పి బాలయ్యను హోస్టుగా చేయమని సలహా ఇవ్వడంతో పాటు కొన్ని టిప్స్ ను తన కూతుర్లతో సహా బాలయ్యకి చెప్పారట. అలా బాలయ్య హోస్ట్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఇలా అన్నిటిలో కూడా బాలయ్య కుటుంబం బాలయ్య కి సపోర్టివ్ గా ఉండడం చేత ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు అలా రాజకీయాలలో కూడా మంచి విజయాలను అందుకుంటూ హిందూపురం ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయాన్ని అందుకున్నారు బాలయ్య.

త్వరలో గోల్డెన్ జూబ్లీ..

ఇక బాలయ్య సినీ ఇండస్ట్రీలో అర్థ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన జరగబోయే ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీలో ఉండే అతిరథ మహారదులు రాబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు