Saloni: శ్రీదేవి వల్లే నా జీవితం ఇలా అయింది.. తెలుగమ్మాయి షాకింగ్ కామెంట్.!

Saloni.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మర్యాద రామన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన తెలుగు అమ్మాయి సలోని (Saloni )!గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో, ప్రముఖ కమెడియన్ సునీల్ (Sunil) హీరోగా నటించిన చిత్రం మర్యాదరామన్న (Maryada ramanna) ఈ సినిమాలో ముందుగా రాజమౌళి త్రిషn(Trisha) ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె కమెడియన్ పక్కన హీరోయిన్గా నటించను అని చెప్పడంతో ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి సలోనిని హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. ఇక ఈ సినిమాతో ఈమెకు ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ లభించింది. ఇకపోతే శ్రీదేవి వల్లే తనకు ఈ గుర్తింపు లభించింది అని చెబుతోంది సలోని. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం

Saloni: My life became like this because of Sridevi.. Telugu girl's shocking comment.!
Saloni: My life became like this because of Sridevi.. Telugu girl’s shocking comment.!

అందం , ప్రతిభ వున్నా అదృష్టం కలిసిరాలేదే..

కొంతమంది హీరోయిన్లు అందంగా ఉన్నా , అద్భుతంగా నటించినా, ఎందుకో అదృష్టం కలిసి రాక వారు ఇండస్ట్రీలో ఎదగలేకపోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో తలుక్కుమంటూ మెరిసి తొందరగానే మాయమైపోయిన హీరోయిన్స్ లలో హీరోయిన్ సలోని కూడా ఒకరు. ఈమె పేరు సలోని అశ్విని. టాలీవుడ్లోకి సుమంత్ (Sumanth) హీరోగా నటించిన ధన 51 అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినా ఈమెకు మాత్రం టాలీవుడ్ లో అవకాశాలు బాగానే లభించాయి. అలా మర్యాద రామన్న, ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె ఆ తర్వాత బాడీగార్డ్, రేసుగుర్రం వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.

మర్యాద రామన్న సినిమాతో స్టార్ స్టేటస్..

ఇకపోతే మర్యాద రామన్న చిత్రంతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈమె పేరు మీదనే “రాయె రాయె సలోని” లాంటి సూపర్ హిట్ పాటను డైరెక్టర్ పెట్టించాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి ఈ పాటకు సంగీతం అందించారు. ఇది నిజంగా సలోని అదృష్టం అని చెప్పవచ్చు. అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపడమే కాదు సినిమా కూడా మంచి విజయం సాధించడానికి కారణమైంది. ఎందుకో ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ స్థాయిలో ఈమెకు అవకాశాలు రాలేదు.

- Advertisement -

శ్రీదేవి వల్లే జీవితానికి గుర్తింపు..

తెలుగులో అవకాశాలు తగ్గడంతో కన్నడ పరిశ్రమకు వెళ్ళిపోయిన ఈమె, అక్కడ సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. 2016లో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన సలోని మళ్లీ ఏడేళ్ల తర్వాత తాజాగా తంత్ర అనే చిత్రంతో ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా ఈ స్టేటస్ రావడానికి కారణం శ్రీదేవి (Sri Devi) అని చెబుతోంది. అసలు విషయంలోకి వెళ్తే ఇండస్ట్రీలోకి రాకముందు ఈమె ఎన్నో డ్రామాలలో నటించిందట. పైగా శ్రీదేవి గొంతును మిమిక్రీ చేయగలదు కూడా.. ఈమె లాగా శ్రీదేవి గొంతును మిమిక్రీ చేసే ఆర్టిస్టు ఇండియాలో కూడా లేరంటే అతిశయోక్తి కాదు. అలా స్టేజి మీద ఇచ్చిన ఒక లైవ్ మిమిక్రీ డ్రామాని చూసిన సావర్ కుమార్ టక్ అనే బాలీవుడ్ దర్శకుడు దిల్ పరదేశి హోగయా చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు. అలా శ్రీదేవి గొంతుని మిమిక్రీ చేయడం వల్ల ఈమె జీవితమే మారిపోయింది. ఇక హీరోయిన్గా ఎదిగి విశేష ప్రేక్షక అభిమానం పొందింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తున్న మట్కా(Matka )చిత్రంలో కూడా నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు