OTT Movie : డ్రగ్ లార్డ్ పై పగ తీర్చుకునే అమ్మాయి… ఈ కొరియన్ క్రైమ్ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం

OTT Movie : ఇప్పటి తరం మూవీ లవర్స్ లో కొరియన్ డ్రామాలు అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? భాష రాకపోయినా సరే అవసరమైతే సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ కొరియన్ డ్రామాలను చూసేవారి లిస్ట్ ఇండియాలో భారీగానే ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ కొరియన్ సిరీస్ లంటే పడి చచ్చే వారికి కొదవలేదు. అంటే వాళ్ల కంటెంట్ ఎంత అద్భుతంగా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగానే తెలుగు మూవీ లవర్స్ కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారు. అయితే ఏకంగా ఇలా ఒక ఇండస్ట్రీ మొత్తంగా ప్రేమ కురిపిస్తున్నారు అంటే వాళ్ళ కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది మరి. ఇక ఈరోజు కే డ్రామాలను ఇష్టపడే మూవీ లవర్స్ కోసమే ఒక క్రేజీ కొరియన్ థ్రిల్లర్ ను మన మూవీ సజెషన్ గా తీసుకొచ్చాం. ఒక్కసారి ఈ సిరీస్ ను చూడడం మొదలు పెడితే ఆపడం కష్టమే అనిపిస్తుంది. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఇప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

సాధారణంగానే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు అంటే మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులోనూ కొరియన్ యాక్షన్ డ్రామా అంటే ఏ రేంజ్ లో ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీలో ఇలాంటి యాక్షన్ ఎలిమెంట్ తో పాటు రివెంజ్ కూడా ఉంటుంది. అలాగే కావాల్సినన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. తండ్రి చావు కోసం ఒక కూతురు ఏకంగా పగ తీర్చుకోవడానికి పోలీస్ కావడం అనేదే ఈ మూవీ స్టోరీ లైన్.

My Name: Season 1 – Review | Netflix Revenge Series | Heaven of Horror

- Advertisement -

కథ ఏంటంటే…

సినిమాలో ఒక డ్రగ్ లార్డ్ ఉంటాడు. అతని దగ్గర హీరోయిన్ తండ్రి పని చేస్తాడు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి పుట్టిన రోజు నాడే చనిపోతాడు. దీంతో హీరోయిన్ తన తండ్రిని ఎవరు చంపారు తెలుసుకోవాలని, తండ్రి చావుకి పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. దీనికోసం ఏకంగా డ్రగ్ లార్డ్ హెల్ప్ కోరుతుంది. అతను హీరోయిన్ పోలీస్ అయితే పగ తీర్చుకోవడం ఈజీ అవుతుందని చెప్తాడు. ఎందుకంటే ఆమె తండ్రిని ఒక పోలీస్ చంపాడని చేస్తాడు. ఇక అతను చెప్పిందే ఆలస్యం హీరోయిన్ పోలీస్ అయ్యేదాకా సరిగ్గా నిద్ర కూడా పోదు. ఎట్టకేలకు పోలీస్ అయ్యాక తన తండ్రిని చంపిన వాళ్లను కనుక్కునే పనిలో పడుతుంది. మరి చివరికి తన తండ్రిని చంపిన వ్యక్తిని హీరోయిన్ కనిపెట్టగలిగిందా? పగ తీర్చుకోగలిగిందా? డ్రగ్ లార్డ్ చెప్పినట్టుగానే హీరోయిన్ తండ్రిని పోలీసులు చంపారా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మై నేమ్ అనే ఈ కొరియన్ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ముఖ్యంగా రివేంజ్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు