OTT Movies : గూస్ బంప్స్ తెప్పించే క్లైమాక్స్… దృశ్యం లాంటి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్స్

OTT Movies : ఈ రోజుల్లో OTTలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి. ఇందులో క్రైమ్, థ్రిల్లర్ నుండి కామెడీ వరకు అన్ని జానర్‌ లకు చెందిన సినిమాలు ఉంటాయి. అయితే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారి కోసమే ఈరోజు మన మూవీ సజేషన్. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే చెవి కోసుకునే వారి కోసమే ఈ రోజు మేము OTTలో అందుబాటులో ఉన్న టాప్ 5 చిత్రాల లిస్ట్ ను మీ ముందుకు తీసుకువచ్చాము. దృశ్యం లాంటి గూస్ బంప్స్ ఇచ్చే క్లైమాక్స్ ఉన్న సినిమాలను చూడాలనుకునే వారు వీటిని మీరు మిస్  చేయకూడదు. ఈ క్రైమ్‌తో నిండిన సినిమాలను చూస్తే ఖచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాబట్టి ఈ వీకెండ్ మీరు OTTలో చూడగలిగే సౌత్ నుంచి నార్త్ దాకా ఉన్న టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల లిస్ట్ పై ఓ లుక్కేద్దాం పదండి.

రాత్ససన్ (Ratsasan)

సస్పెన్స్, క్రైమ్ రెండింటి ఫ్లేవర్ ‘రాత్ససన్’ చిత్రంలో కనిపిస్తుంది. ఒక పోలీసు, ఒక సైకో కిల్లర్ కథతో ఈ మూవీ చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ముఖ్యంగా ఆ సైకో గిఫ్ట్ ఇచ్చి చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి చంపుతూ పోలీసులకు ఛాలెంజ్ గా మారతాడు. అతడిని హీరో ఎలా పట్టుకున్నాడు అన్నదే స్టోరీ. ఈ మూవీ తెలుగులో రాక్షసుడు పేరుతో రిలీజ్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ చూడచ్చు.

Raatchasan Telugu Teaser Featuring Bellam Konda Srinivas | Galatta

- Advertisement -

ఇత్తెఫాక్ (ittefaaq)

‘ఇత్తెఫాక్’ క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు సస్పెన్స్‌తో కూడుకున్న చిత్రం. ఇందులో అక్షయ్ ఖన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా క్లైమాక్స్ ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడచ్చు.

సెల్యూట్ (salute)

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు పెట్టింది పేరు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘సెల్యూట్’ మూవీ కూడా ఈ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలో దుల్కర్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడు. అతని నటన నుండి స్టోరీ వరకు మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ చిత్రాన్ని సోనీ లివ్‌లో చూడచ్చు.

భ్రమమ్ (Bhramam)

‘భ్రమమ్’ ఒక కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఇది అంధ పియానిస్ట్ కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమా క్లైమాక్స్, సస్పెన్స్ చూసినంతసేపు మీకు చెమటలు పట్టిస్తాయి. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడచ్చు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు.

South star Prithvirajs Bhramam trailer drops online, thriller to release on Amazon Prime Video - Watch | Regional News | Zee News

పుజు (puzhu)

సైకో-సస్పెన్స్‌తో నిండిన ‘పుజు’ చిత్రం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. ఈ చిత్రం 2022లో విడుదలైంది. ప్రస్తుతం ఈ థ్రిల్లర్ మూవీ సోని లైవ్‌ అందుబాటులో ఉంది. ఈ లిస్ట్ లో ఏ మూవీని అయినా ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు