Jr NTR : అప్పుడు ముంబైలో.. ఇప్పుడు బెంగుళూర్ లో.. దూరం ఉండడమే మంచిదిలే..

Jr NTR : నందమూరి ఫ్యామిలీ లో కొన్నాళ్లుగా మనస్పర్థలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం మరింత పెరిగిపోయిందని తెలుస్తూనే ఉంది. ఎన్నో ఏళ్లగా వీరి మధ్య మనస్పర్థలు ఉన్నా, హరికృష్ణ ఉన్నంత వరకు ఫ్యామిలీ పరంగా కలుస్తూనే ఉన్నారు. కానీ ఆ తర్వాత దూరం పెరిగిపోగా, రీసెంట్ గా లాస్ట్ ఇయర్ తారక రత్న మరణం తర్వాత వీళ్ళ మధ్య ఎంత దూరం పెరిగిందో బహిర్గతమైంది. అయితే తాత ఎన్టీఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ కాస్త తగ్గినా, ఇప్పుడు తనకు కూడా ఓపిక నశించిందని తెలుస్తుంది. అందుకే పిలవని పేరంటానికి దూరంగానే ఉండాలన్నట్టు ఎన్టీఆర్ దూరమవుతున్నాడు.

Jr NTR in Bangalore away from NBK50 years celebrations

NBK50 ఇయర్స్ కి దూరం..

ఇక తాజాగా నేడు నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా NBK50ఇయర్స్ (NBK50Years) వేడుక సెప్టెంబర్ 1న భారీ ఎత్తున జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులు, నందమూరి కుటుంబీకులు కలిసి ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు జరపనున్నారు. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తొలి ఆహ్వానం అందగా, ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలు, దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్ ఫ్యామిలీస్ అందరికీ, నిన్న మొన్న వచ్చిన విశ్వక్ సేన్ లాంటి హీరోలకు కూడా ఆహ్వానం అందింది. ఇంకా చెప్పాలంటే బాలయ్య దూరంగా ఉండే కొందరు హీరోలకు కూడా ఆహ్వానం అందింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఆహ్వానం వెళ్ళలేదు. బాలయ్య ప్రమేయం లేకుండా ఇది జరిగిందని చెప్పలేం. అంతా తెలిసే జరుగుతుందని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది.

- Advertisement -

అప్పుడు ముంబైలో.. ఇప్పుడు బెంగుళూర్ లో..

అయితే అప్పుడు ఎన్టీఆర్ 100 ఇయర్స్ ఈవెంట్ జరిగినపుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం పంపలేదు బాలయ్య. దాంతో అప్పుడు దూరంగా ఉందామని వార్2 షూటింగ్ పేరిట ముంబై వెళ్ళాడు. ఇక ఇప్పుడు NBK50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి బెంగుళూర్ వెళ్ళాడు తారక్ (Jr NTR). అక్కడ కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తో కలిసి ఫ్యామిలీ టూర్ వేసిన సంగతి తెలిసిందే. పలు పుణ్యక్షేత్రాలకు టూర్ వేసిన ఎన్టీఆర్ బెంగుళూర్ లో రిషబ్ శెట్టి ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం. ఇక అప్పుడు ఎన్టీఆర్ ఈవెంట్ కి దూరంగా, ముంబై వెళ్లిన తారక్, ఇప్పుడు బాలయ్య ఈవెంట్ కి దూరంగా బెంగుళూర్ కి ఫ్యామిలీతో వెళ్ళాడు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దూరంగా ఉండడమే మంచిదయిందని కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు