PVR Inox: ఆడియన్స్ పిచ్చోళ్లను చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్.. మూవీ పాస్ పేరిట కొత్త మోసం..!

PVR Inox.. ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్ నిర్వాహకులు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే వీరు చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను పిచ్చోళ్లను చేయడమే కాదు మోసం కూడా చేస్తున్నారని చెప్పవచ్చు అందులో భాగంగానే పీవీఆర్ ఐనాక్స్ మూవీ పాస్ పేరిట ప్రజలను పిచ్చోళ్లను చేస్తోందని వార్త తెరపైకి వచ్చింది అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

PVR Inox: PVR Inox making the audience crazy.. New scam in the name of Movie Pass..!
PVR Inox: PVR Inox making the audience crazy.. New scam in the name of Movie Pass..!

పివిఆర్ మూవీ పాస్ పేరిట కొత్త ప్రోగ్రాం..

భారతదేశపు అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ PVR ఐనాక్స్.. పివిఆర్ మూవీ పాస్ ప్రోగ్రామ్ ను తాజాగా ప్రవేశపెట్టింది ఇది నెలవారి పాస్. వినియోగదారులు ఒక నెలలో నాలుగు చిత్రాలను ఉచితంగా చూడడానికి ఈ పాస్ ఉపయోగపడుతుంది. అయితే ఈ పాస్ ధర అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఉదాహరణకు ఏపీ మరియు తెలంగాణలలో పివిఆర్ మూవీ పాస్ ధర రూ.350.. అంటే వినియోగదారుడు ఒకసారి 350 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తే.. ప్రతినెల నాలుగు సినిమాలను ఉచితంగా చూడవచ్చు. ఇకపోతే ప్రతి సినిమాకు 250 రూపాయలు టికెట్ ధర వెచ్చించి కొనుగోలు చేయలేని వారికి ఈ పాస్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని అందరూ అనుకున్నారు. అందులో భాగంగానే ఈ మూవీ పాస్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. నామమాత్రపు ధరతో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఈ మూవీ పాస్ ఉపయోగించారు.

బ్లాక్ అవుట్ పీరియడ్ అంటూ మూవీ పాస్ పై కొత్త నిబంధన..

ఇది PVR తన ఫుట్‌ఫాల్‌ను పెంచడంలో కొంతవరకు సహాయపడింది. అయితే, మూవీ పాస్ ప్రోగ్రామ్‌లో PVR ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ప్రేక్షకుల నుండి విమర్శలను పొందుతోంది. ఇటీవల PVR ఈ ప్రోగ్రామ్ నుండి కొన్ని చిత్రాలకు బ్లాక్అవుట్ పీరియడ్ పెట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే చలనచిత్రాలలో స్త్రీ 2, డెడ్‌పూల్, వుల్వరైన్, వేదా, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ బ్లాక్‌అవుట్ వ్యవధి అంటే విడుదలైన మొదటి వారంలో నిర్దిష్ట చిత్రాలకు మూవీ పాస్ వర్తించదు.

- Advertisement -

పెద్ద సినిమాలను మొదటి వారంలో చూడలేం..

బ్లాక్‌అవుట్ పీరియడ్ కారణంగా ఇప్పుడు కంగువ, GOAT, దేవర, జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్, వెట్టైయాన్, వెనం: ది లాస్ట్ డ్యాన్స్, భూల్ భూలైయా 3, సింఘమ్ ఎగైన్, పుష్ప: ది రూల్, గేమ్ ఛేంజర్, ముఫాసా, బేబీ జాన్, సితారే జమీన్ పర్ వంటి పెద్ద చిత్రాలను కూడా విడుదలైన మొదటి వారంలో చూడడం కుదరదు. . సాధారణంగా ప్రేక్షకులు ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలను థియేటర్లలో చూడటానికి ఇష్టపడతారు. అంతేకాదు విడుదలైన మొదటి వారంలోపే సినిమాలు చూడాలని కోరుకుంటారు.. ఇలాంటి వారికి ఈ మూవీ పాస్ వర్తించకపోతే పీవీఆర్ ద్వారా తాము మోసపోయినట్లు భావిస్తారంటంలో సందేహం లేదు. అయితే పివిఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం పెద్ద పెద్ద సినిమాలకు భారీ టికెట్ ధరలు చెల్లించకుండా ఉండడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మొత్తానికైతే పివిఆర్ నిర్ణయాన్ని ప్రేక్షకులు తప్పుపడుతున్నారు. ప్రజలకు ఆశ చూపించి మోసం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు