Chiranjeevi : తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరు సందేశం.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు, ప్రజలకు ఎంత సేవ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారానే కాకుండా ఎప్పటికప్పుడు పలు సందర్భాల్లో, అభిమానులకు, ఇండస్ట్రీలో తన తోటివాళ్లకు ఎంతో సాయపడుతూ ఉంటారు. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా ఎంతో మందికి సేవ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా కేరళలో జరిగిన ప్రకృతి విపత్తుకు తన వంతు సాయంగా కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం అధికం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిస్తూ, ప్రజల్ని అప్రమత్తం చేసారు చిరు.

Chiranjeevi alert message to the people of Telugu states

 

- Advertisement -

ప్రజలకు చిరు విన్నపం..

ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తుఫాను వర్షాల ప్రభావంపై చిరంజీవి (Chiranjeevi) ప్రజలను అప్రమత్తం చేస్తూ విన్నవించుకున్నారు. సోషల్ మీడియాలో చిరు ట్వీట్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు… “తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి.

ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు (Mega Fans) ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను.. అని చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాల ప్రభావం మరో మూడు రోజులు ఉన్నట్టు తెలుస్తుంది.

విశ్వంభరలో చిరు బిజీ…

ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వశిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 200 కోట్లకి పై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ముగింపు దశకు చేరుకోగా, రీసెంట్ గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు