Pushpa 2 : హిస్టరీలో మిగిలిపోయే క్లైమాక్స్ ఇది… ప్రత్యేకతలు ఏంటి అంటే?

Pushpa 2: ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన చిత్రం పుష్ప (Pushpa). ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విషయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కి ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసింది ఈ సినిమా. దీనికి తోడు అల్లు అర్జున్ నటనకు గానూ ఏకంగా జాతీయస్థాయి(national award)అవార్డు లభించడమే కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో మొట్ట మొదటి జాతీయ అవార్డు అందుకున్న హీరోగా పేరు అందించింది. అలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు.

Pushpa 2 : This is the climax that will go down in history... What are the specials?
Pushpa 2 : This is the climax that will go down in history… What are the specials?

150 మంది ఫైటర్స్ తో అదిరిపోయే క్లైమాక్స్..

ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ సినిమా షూటింగ్ వాయిదా పడడం వల్ల విడుదల ఆలస్యం అయ్యింది. అందులో భాగంగానే డిసెంబర్ 6వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇకపోతే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. దాదాపు 150 మంది ఫైటర్స్ తో నెవర్ బిఫోర్ ఇండియన్ స్క్రీన్ అన్నట్టుగా 23 రోజులపాటు క్లైమాక్స్ షూట్ చేసినట్లు సమాచారం. ఒక బీభత్సమైన క్లైమాక్స్ ని రూపొందించారు అని చెప్పవచ్చు. దీనికోసం అల్లు అర్జున్ ఎంతో హోంవర్క్ చేసి స్పెషల్ మార్షల్ కూడా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ కూడా చాలా కేర్ తీసుకొని మరి దాదాపు 20 మంది రైటర్స్ తో క్లైమాక్స్ ప్లాన్ చేశారట. యాక్షన్ డైరెక్టర్గా నవకాంత్ చేస్తున్న ఈ క్లైమాక్స్ చరిత్రలో నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

సెంటిమెంట్ ను పుష్ప 2 బ్రేక్ చేస్తుందా..

మొత్తానికి అయితే హిస్టరీలో నిలిచిపోయే క్లైమాక్స్ సీన్ ని పుష్ప2 లో పెట్టబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ఫహాధ్ ఫాజిల్ తో పాటు సునీల్,అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. నిజానికి సినీ ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది. మొదటి భాగం సూపర్ హిట్ అయితే రెండవ భాగం అసలు ప్రేక్షకులను మెప్పించదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ సెంటిమెంట్ ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

- Advertisement -

మెగా వివాదంలో అల్లు అర్జున్..

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మెగా అభిమానులు, జనసేన నాయకులు అల్లు అర్జున్ పై పూర్తి స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి అని, చిరంజీవి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలని ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం తగ్గేదేలే అంటూ కామెంట్లు చేస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మెగా అభిమానుల ఆగ్రహం పుష్ప 2 పై పడకుండా చూసుకుంటే చాలు అంటూ సినీ విశ్లేషకులు కోరుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు