NBK 50 Years Event : బాలయ్య ఈవెంట్ కి తారక్ రాకుండా ఉండడానికి కారణం దొరికింది.. అమ్మ పేరు చెప్పి భలే తప్పించుకున్నాడే..!

NBK 50 Years Event.. నందమూరి బాలకృష్ణ (Balakrishna) చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.. 1974లో తన తండ్రి నటనా స్వీయ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మకల అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైనా.. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ఆకట్టుకున్న బాలకృష్ణ ఆ తర్వాత పలు చిత్రాలలో యుక్త వయసులో నటించి అలరించారు. ఇక తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

NBK 50 Years Event : Tarak found a reason for not coming to Balayya's event.
NBK 50 Years Event : Tarak found a reason for not coming to Balayya’s event.

బాలకృష్ణ ఈవెంట్ నుంచీ తప్పించుకున్న ఎన్టీఆర్..

ఇకపోతే బాలకృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అర్థ శతాబ్ద వేడుకను గోల్డెన్ జూబ్లీ పేరిట ఇండస్ట్రీలో చాలా ఘనంగా ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి నందమూరి వారసులైన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లను ఆహ్వానించలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి తోడు ఈ రూమర్స్ నుంచి ఎన్టీఆర్ చాలా చక్కగా తప్పించుకున్నాడని మనకు అర్థమవుతుంది. అసలు ఏమైందంటే సెప్టెంబర్ రెండవ తేదీన ఎన్టీఆర్ తల్లి షాలిని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కోరికను నెరవేర్చడానికి ఆయన షాలిని స్వగ్రామమైన కర్ణాటకలోని కుందాపురానికి వెళ్లారు.

తల్లితో కలిసి కుందాపూర్ కు వెళ్లిన ఎన్టీఆర్..

నిన్ననే అక్కడికి చేరుకున్న ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి , తల్లి షాలినితో కలిసి కుందాపురం లో ఉన్న శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి, తన తల్లి కోరికను నెరవేర్చాను అని, ఇందుకు సహకరించిన హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు ఎన్టీఆర్. మొత్తానికైతే ఇక్కడ బాలయ్య గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి ఎన్టీఆర్ ను బాలకృష్ణ ఆహ్వానించారా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఒకవేళ ఆహ్వానిస్తే.. హైదరాబాదులో ఉండి ఈవెంట్ కు ఎందుకు రాలేదు అనే క్వశ్చన్ వస్తుంది.. అలాంటి క్వశ్చన్ ఎదుర్కోవడం ఇష్టం లేక తన తల్లిని తీసుకొని కుందాపురానికి వచ్చారా లేక అక్కడ పిలవకపోవడం వల్ల అవమాన భారంతో ఉండడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఆ కార్యక్రమం నుంచి ఎన్టీఆర్ భలే తప్పించుకున్నారే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఎన్టీఆర్ సినిమాలు..

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత దేవర 2 లో కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు