Mahesh Babu: మహేష్ బాబు కంటే ఆయన అభిమానులే బిజీగా ఉన్నట్లు ఉన్నారు

Mahesh Babu: ప్రస్తుతం జరుగుతున్న ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు సినిమా రిలీజ్ అంటే ఒక రకమైన పండగ వాతావరణం ఉంటుంది. మహేష్ చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. మిక్స్డ్ టాక్ తో కూడా ఈజీగా 100 కోట్లు మార్కెట్ ను దాటేస్తాయి మహేష్ బాబు సినిమాలు. అది మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ అని చెప్పాలి. రీసెంట్ గా మురారి సినిమా రీ రిలీజ్ చేసినా కూడా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఫ్యామిలీ సినిమాకి ఎవరు వస్తారు అని అందరూ ఊహించిన తరుణంలో మహేష్ బాబు స్టామినా ఏంటో మరోసారి రుజువైంది.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో తన 29వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ రావడానికి దాదాపు ఇంకో నాలుగు ఏళ్లు పడుతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో దీని మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదొక అడ్వెంచర్ ఫిల్మ్ అని ఇదివరకే రివీల్ చేశారు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో కనిపించనున్నారు. రీసెంట్గా మహేష్ వెళ్తున్న టూర్లు బట్టి ప్రతిసారి ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉన్నారు

మహేష్ టూర్ కి వెళ్ళడమే కాకుండా సినిమాలు కూడా విపరీతంగా చూస్తుంటారు. ఏదైనా ఒక సినిమా నచ్చితే దాని గురించి పదిమందికి చెబుతూ ఉంటారు సూపర్ స్టార్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా గురించి చెప్పిన తర్వాత ఆ సినిమాని చూసిన ప్రేక్షకులు కూడా ఉంటారని చెప్పాలి. అయితే అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని రూల్ లేదు. మహేష్ కి నచ్చిన కొన్ని సినిమాలు కూడా కొంతమంది అభిమానులకు నచ్చినపుడు ఈ సినిమా ఎలా నచ్చింది అన్న అంటూ ట్రోల్ చేయటం కూడా మొదలుపెట్టారు.

- Advertisement -

Maruthi Nagar Subramanyam

మహేష్ బాబు ట్వీట్

ఇక రీసెంట్ గా సుకుమార్ వైఫ్ ప్రజెంట్ చేసిన మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైంది. అయితే ఈ సినిమాకి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ ని ఈ సినిమా సాధించలేకపోయింది. ఈ తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. ఈ సినిమా తనకు ఎంతలా నచ్చిందో చెప్పుకొచ్చారు. దీనిపై కొంతమంది అభిమానులు స్పందిస్తూ, మీకంటే నేనే బిజీగా ఉన్నట్లు ఉన్నాను అంటూ ట్విట్టర్ వేదిక పోస్టులు చేయడం మొదలుపెట్టారు. అంటే దీని వెనుకున్న ఉద్దేశాన్ని గ్రహిస్తే ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు మీరు చూస్తున్నారు మేము చివరగా థియేటర్ లో కల్కి వంటి సినిమాలే చూసాం, ప్రతి చిన్న సినిమా కూడా చూసే టైం మీకు ఉంది అంటూ సర్కాస్టిక్ గా పోస్టులు పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు