Poonam kour: త్రివిక్రమ్ నే అడగండి అంటూ.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్..!

Poonam Kaur.. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో అవకాశాలు వచ్చినా అదృష్టం కలిసి రాలేక హీరోయిన్ గా ఫేడౌట్ అయిన పూనమ్ కౌర్ (Poonam Kaur) రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. పూనమ్ కౌర్ సినిమాలలో కంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) లను టార్గెట్ చేస్తూ చేసే కామెంట్స్ కారణంగా భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల సినిమాలకు దూరమై రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం పై స్పందిస్తూ ఉంటుంది. ఎక్కువగా డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ఏవో ఒక సంచలన పోస్టులు షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Poonam Kaur: Ask to Trivikram.. Poonam Kaur's Post Viral..!
Poonam Kaur: Ask to Trivikram.. Poonam Kaur’s Post Viral..!

షర్మిలను ట్యాగ్ చేసిన పూనమ్..

ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ గురించి స్పందిస్తూ ఉండేది.. అయితే ఈమధ్య అటు ప్రభుత్వం మీద గానీ, ఇటు పవన్ కళ్యాణ్ మీద గానీ పోస్ట్లు చేసినట్టు అయితే కనిపించడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన గుడ్లవల్లేరు కాలేజీలో జరిగిన హిడెన్ కెమెరాల సంఘటన పైన కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు అయిన షర్మిలాను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ ని అయితే షేర్ చేసింది. ఈ సంఘటన పైన ఎన్నో రకాల రిక్వెస్ట్ లను కూడా పెడుతూనే ఉన్నది పూనమ్ కౌర్..

నెటిజన్ ఫైర్..

అంతేకాకుండా వీటితోపాటు కొన్ని కౌంటర్స్ వేస్తూ మన చుట్టూ ఉండే బలమైన వారిపైన బలహీనంగా పనిచేస్తాము. బలహీనమైన వారిపైన చాలా బలంగా పనిచేస్తామనే విధంగా సెటైర్లు వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలేజీ సంఘటనను ఒక అమ్మాయి ఇలా చేసిందనే విషయం తెలిసి తనకు చాలా బాధగా అనిపించింది అంటూ, కచ్చితంగా అమ్మాయిల కోసం పోరాడాలనిపించింది అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. దీనిపై ఒక నెటిజన్ మాత్రం ఇలా ట్వీట్ చేస్తూ.. నువ్వు కూడా ఒక కూతురివి.. మహిళవి కూడా.. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు చాలామంది మీద ఎన్నో ఆరోపణలు చేశావు. ఎప్పుడు నిజం చెప్పలేదు. రూమర్లన్నిటికీ కూడా నువ్వే కారణం అయ్యావు.. ముందు నువ్వు పర్ఫెక్ట్ గా ఉండు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

- Advertisement -

త్రివిక్రమ్ ని అడగండి అంటున్న పూనమ్..

ఆ నెటిజన్ కి సైతం పూనం కౌర్ రిప్లై ఇస్తూ.. వాటన్నింటికీ సమాధానాలు మీకు తెలియాలి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అడగండి అంటూ అదిరిపోయే కౌంటర్ వేసింది. గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ కి చాలా ద్వేషం గా వున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ త్రివిక్రమ్ పేరు మాత్రం అసలు వదలడం లేదు. గతంలో వినిపించిన సమాచారం మేరకు జల్సా సినిమా సమయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తుంటాయి. కానీ అసలు నిజం ఏంటన్నది పూనమ్ కౌర్ మాత్రమే చెప్పగలరు. మరి రాబోయే రోజుల్లో చెబుతుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు