Venkatesh Maha: వెంకటేష్ మహా మాటలను వివేక్ సీరియస్ గా తీసుకున్నాడు

Venkatesh Maha: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి 2018 పెను మార్పులు తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి గొప్ప గొప్ప సినిమాలన్నీ అదే ఏడాది రిలీజ్ అయ్యాయి. చాలని కొత్త దర్శకులు కూడా అప్పుడే తెలుగు ఫుల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అందులో వెంకటేష్ మహా ఒకరు. కేరాఫ్ కంచరపాలెం(C/o Kancharapalem) అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్ మహా. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. కేవలం కమర్షియల్ గా సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకి అనేక రకమైన ప్రశంసలు తగ్గాయి.

ఒక మామూలు సినిమాగా మొదలైన ఈ సినిమాను హీరో రానా నెక్స్ట్ లెవెల్ కి ప్రమోషన్ చేసి తీసుకెళ్లాడు అని చెప్పొచ్చు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఈ సినిమాను రిలీజ్ చేశారు. అప్పటికే బాహుబలి(Bahubali) సినిమాతో మంచి గుర్తింపు చెందిన రానా(Raana) చెప్పడంతో ఈ సినిమా కూడా మంచి రీచ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ మహా చేసిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. మలయాళం లో ఫహద్ ఫాజిల్(Fahadh Fazil) నటించిన మహేశింటే ప్రతీకార సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటి లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు కూడా వెంకటేష్ మహా తనదైన శైలిని జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు.

ఇకపోతే ప్రతి దర్శకుడు కి ఒక్కో రకమైన అభిప్రాయాలు ఉండడం సహజంగా జరుగుతుంది. అయితే అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని రూల్ కూడా లేదు. ఒక సందర్భంలో చాలామంది డైరెక్టర్ అంతా కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా కెజిఎఫ్ సినిమాని ఉద్దేశిస్తూ అనేక రకమైన విమర్శలు చేశాడు. దానితో అక్కడున్న దర్శకులంతా ఒకసారిగా నవ్వారు. ఆ సందర్భంలోనే ఇక్కడున్న వాళ్ళమంతా పెన్ను పట్టడం మానేసి కత్తి పట్టుకుంటే వాళ్ళ బాబు లాంటి సినిమాలు తీస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు.

- Advertisement -

Venkatesh Maha

ఇకపోతే కేజీఎఫ్ సినిమా మీద వెంకటేష్ మహా చేసిన విమర్శలు తీవ్రమైన దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత చాలామంది ప్రత్యేకంగా క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది మొత్తానికి ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఇప్పటికే 50 కోట్ల పైగా వసూలు చేసింది. అయితే వివేక్ ఆత్రేయ కెరియర్ లో వచ్చిన ఫస్ట్ మాస్ కమర్షియల్ సినిమా ఇది. అయితే ఈ సినిమాని ప్రస్తావిస్తూ వెంకటేష్ మహా చెప్పిన మాటలను వివేక ఆత్రేయ సీరియస్ గా తీసుకొని మొదటి అడుగు వేశాడు అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు