Samantha: మాజీ మామ కోసం సమంత అలాంటి సహాయం..!

Samantha.. హీరోయిన్ సమంత (Samantha ) జీవితంలో అనుకోని మలుపులు రోజుకొకటి తిరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా స్టార్డం ఎంతలా వచ్చిందో తన ప్రేమ, పెళ్లి, వివాహం అన్నీ కూడా సమంతకి ఆనందం ఇచ్చినప్పటికీ.. ఆ ఆనందం మాత్రం రోజులు నిలబడలేదు. నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత వివాహమైన కేవలం నాలుగేళ్లకే విడాకుల బాట పట్టింది. కానీ సమంత అక్కినేని కోడలిగా ఉన్నన్ని రోజులు అక్కినేని కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. తెలుగులో కూడా టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది సమంత. ఆ వెంటనే మయోసైటిస్ అనే వ్యాధి కూడా సమంతకు చాలా ఇబ్బందులను తలెత్తేలా చేసింది.

samantha-samantha-is-such-a-help-for-ex-uncle
samantha-samantha-is-such-a-help-for-ex-uncle

నాగార్జునకు సహాయపడిన సమంత..

ప్రస్తుతం అయితే సమంత ఒంటరిగా గానే జీవితాన్ని గడుపుతున్నప్పటికీ గతంలో తన మామగా పేరుపొందిన నాగార్జునకు సమంత బిగ్ బాస్ షోలో హెల్ప్ చేసిందట. అదేమిటంటే నాగార్జున తెలుగు బిగ్ బాస్ కు హోస్టుగా వ్యవహరిస్తున్న సమయంలో నాలుగో సీజన్ కి కొద్దిరోజులు నాగార్జున లేకపోవడంతో ఒక వారం రోజులు అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్ గా రాగా, మరొక వారం రోజులు సమంత హోస్ట్ గా వ్యవహరించింది. అయితే అప్పుడు అక్కినేని కోడలుగా సమంత మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో హోస్టుగా కూడా మొదటిసారి అవతారం ఎత్తడంతో ఆ ఎపిసోడ్లు చాలా కీలకంగా మారాయి.

బిగ్ బాస్ హోస్ట్ గా సమంత…

ముఖ్యంగా సమంత చేసిన ఎపిసోడ్లకు టిఆర్పి రేటింగ్ కూడా భారీ స్థాయిలోనే సంపాదించింది.బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు రానంత రేటింగ్ సమంత హోస్ట్గా వ్యవహరించిన ఎపిసోడ్ లకి వచ్చేసింది. ఏకంగా అప్పుడు 11.4 శాతం టిఆర్పి రేటింగ్ తో సమంత సరికొత్త రికార్డును తిరగరాసింది.. తన మామ కోసం సమంత చేసినటువంటి ఈ సహాయం మాత్రం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. అయితే ఆ తర్వాత చైతన్యతో సమంత విడిపోవడంతో అక్కినేని కుటుంబానికి దూరమైంది.

- Advertisement -

సమంతా రికార్డు బ్రేక్ చేయడానికి మూడేళ్లు..

అయితే సమంత రికార్డు చెరిపేయడానికి దాదాపుగా మూడు సంవత్సరాలు సమయం పట్టినట్లు తెలుస్తోంది. బిగ్బాస్ సీజన్ సెవెన్ లాంచింగ్ ఎపిసోడ్లో ఏకంగా..18.1 రేటింగ్ సైతం నమోదు చేసుకున్నట్లు సమాచారం. అలా తన మాజీ మామ నాగార్జునకు సమంత ఇలా సహాయం చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ -8 వ సీజన్ మొదలు కాబోతోంది.. మరి ఈ షో ఎంతటి టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంటుందో చూడాలి మరి.

సమంత సినిమాలు..

ఇక సమంత విషయానికి వస్తే.. విడాకుల తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈమె.. ఇప్పుడు వాటన్నింటిని అధిగమించి మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోవడానికి దాదాపు ఏడాది పాటు విరామం ప్రకటించి , ఇప్పుడే మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఒకవైపు నిర్మాతగా మా ఇంటి బంగారం అనే సినిమాను కూడా నిర్మిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇంకొక వైపు ఈమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సీరీస్ హిట్ అయితే గనుక సమంతకు ఆఫర్లు జోరుగా వచ్చి పడతాయనటంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు