OTT Movies : అందాన్ని ఎరగా వేసి ట్రాప్… పిచ్చెక్కించే బో*ల్డ్ మూవీ

OTT Movies : సమాజంలో రోజురోజుకు ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు ఎక్కువవుతున్నాయి. తరచుగా మన చుట్టుపక్కల జరిగే ఇలాంటి సంఘటనలు చూస్తే సమాజం ఎటు పోతుందో అనే ఆలోచనలో పడిపోతాము. కానీ తొలిచూపులోనే ప్రేమ అంటూ జరిగే మోసాలు అన్నీ ఇన్ని కావు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాము అంటూనే ఊహించనంత దారుణంగా మోసం చేస్తారు. ఇక ఈ సినిమాను చూస్తే ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారైనా, లేదంటే అలాంటి రిలేషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న వారైనా కలవర పాటుకు గురి కావాల్సిందే. ప్రేమ పేరుతో అమ్మాయి అబ్బాయిలు చేసే మోసాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మరి ఇంట్రెస్టింగ్ క్రేజీ థ్రిల్లర్ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ప్రేమ ముసుగులో జరిగే మోసాలను ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. ఎంతో నమ్మకంతో ఉండాల్సిన ఇలాంటి రిలేషన్ ను స్వలాభం కోసం కొంత మందిని ట్రాప్ లో పడేసి మోసం చేయడం అన్నది అత్యంత దారుణమైన విషయం. అయితే ఈ సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువైనప్పటికీ, 20 ఏళ్ల క్రితమే ఓ సినిమాలో అన్ని విషయాలను చూపించారు. ఇక స్టోరీలోకి వెళ్తే.. సినిమాలో రెండు జంటలు ఉంటాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలవడమే కాకుండా ప్రేమలో కూడా పడతారు. ఆ తర్వాతే వాళ్ళ నిజ స్వరూపం బయట పడుతుంది. ఇక నుంచి మూవీ పరుగులు పెడుతుంది. ప్రేమ పేరుతో వాళ్లు చేసే మోసాలు మనలో ఆలోచనను రేకెత్తిస్తాయి. ఒకరి జీవితంలోకి మరొకరు ఎంట్రీ ఇస్తే మోసం చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ గుండె దడ పుట్టేలా చేస్తుంది. ఇక ఈ సినిమాలో కేవలం చీటింగ్ సీన్స్ మాత్రమే కాకుండా కొన్ని బో*ల్డ్ సీన్స్ కూడా ఉంటాయి.

30 Facts about the movie Closer - Facts.net

- Advertisement -

అందాన్ని ఎరగా వేసి ఎలా ట్రాప్ చేస్తారు అనే విషయాన్ని సినిమాలో చూపించారు. నిజానికి మోసపోతున్న వాళ్లకు అసలు ఆ విషయం తెలీదు. అలాగే మోసం చేస్తున్న వాళ్ళు కూడా ఆ విషయాన్ని ఎక్కడ బయట పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ నిజాన్ని ఎక్కువ కాలం దాచడం అన్నది సాధ్యం కాదు కదా.. ఒకానొక సందర్భంలో ఒకరినొకరు కలిసినప్పుడు అసలు విషయం బయట పడుతుంది. ఆ ఇద్దరు జంటలు నిజం బయట పడ్డాక ఏం చేశారు? మోసపోయింది ఎవరు? మోసం చేసింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే క్లోజర్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. సినిమాలో సీను సీనుకు ఓ ట్విస్టు తో పాటు టర్నింగ్ పాయింట్స్ కూడా చాలానే ఉంటాయి. కాగా ఈ సినిమా ప్రస్తుతం ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఇలాంటి డీఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను బాగా ఇష్టపడే వారు ఈ వీకెండ్ తప్పకుండా చూడండి. ఇక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మైకంలో ఉన్నవారు కూడా డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు