Kanguva: సినిమా పోస్ట్ పోన్ అని హీరోనే చెప్పేసాడు

Kanguva: కోలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో కంగువ ఒకటి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టిన శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో దర్శకుడుగా కొన్ని సినిమాలు చేసినా కూడా తమిళ్లో వరుస సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్గా అక్కడ పేరు సాధించాడు శివ. చివరగా రజనీకాంత్ తీసిన అన్నత్తే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన శివ(Siva) ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంది అని చెప్పొచ్చు.

కంగువ సినిమాని అక్టోబర్ 10 వ తారీఖున రిలీజ్ చేస్తారు అని ఇదివరకే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా ఆ డేట్ కి రావట్లేదు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. అదే రోజున రజనీకాంత్ నటిస్తున్న వెట్టేయన్ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆరోజు రెండు సినిమాలు పోటీలో పడతాయి అనుకున్న తరుణంలో ఈ సినిమా వెనక్క తగ్గుతుంది అని వార్తలు వినిపించడం ఆశ్చర్యం. ఇక ఈ వార్తలన్నిటికీ తన స్పీచ్ తో చెక్ పెట్టేసాడు సూర్య.

Kanguva

- Advertisement -

రీసెంట్గా జరిగిన ఒక సినిమా ఫంక్షన్ కి సూర్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ రజనీకాంత్ గురించి ప్రశంసించారు. రజనీకాంత్ సార్ సినిమా వెట్టేయన్ అక్టోబర్ 10 రిలీజ్ అవుతుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీకి రజనీకాంత్ గారు మంచి గుర్తింపును తీసుకొచ్చారు. ఆయనతో మన సినిమా పోటీగా అక్టోబర్ 10న రిలీజ్ కావట్లేదు అంటూ సూర్య చెప్పుకొచ్చారు. దీనితో ఈ సినిమా పోస్ట్ పోన్ ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. ఈ సినిమాపై నిర్మాత జ్ఞానవేల్ రాజా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చివరికి ఒక సందర్భంలో మాట్లాడుతూ కంగువ పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు వేరే సినిమాలు పోటీకి రావచ్చు. కానీ పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు మాత్రం కొన్ని సినిమాలు వెనక్కి తగ్గుతాయని సినిమాపై తన నమ్మకాన్ని చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు