8 years for Janatha Garage : అరుదైన సినిమాను తెరకెక్కించాడు

8 years for Janatha Garage : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో కొరటాల శివ ఒకరు. రచయితగా కెరియర్ మొదలు పెట్టిన శివ మిర్చి(Mirchi) సినిమాతో దర్శకుడుగా మారాడు. రచయితగా ఉన్నప్పుడే ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథను మాటలను అందించారు కొరటాల. ఇక మిర్చి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి(Bahubali) ముందు రిలీజ్ అయిన సినిమా ప్రభాస్ కి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ప్రభాస్ అభిమానులు కూడా సినిమా బాగా కలిసి వచ్చింది. ఆ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వం వహించిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా 100 కోట్లు మార్కును దాటింది.

ఒక ఎన్టీఆర్ సమంత నిత్యమీనన్లు కలిసిన సినిమా జనతా గ్యారేజ్(Janatha Garage). ఈ సినిమా శివా కెరియర్ కి హ్యాట్రిక్ హిట్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ను చాలా అందంగా చూపించాడు కొరటాల. ఇప్పటివరకు ఎన్టీఆర్(Ntr) ని చాలా స్టైలిష్ గా చూపించిన సినిమాలలో జనతా గ్యారేజ్ సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమాలోని డైలాగ్స్, ఈ సినిమా క్యారెక్టర్ కథను డిజైన్ చేసిన విధానం ఈ సినిమాలోని మిగతా క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా డిజైన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కొరటాల శివ.

మామూలుగా ఇప్పుడు పుష్ప వంటి సినిమాలు చూస్తే హీరో క్యారెక్టర్ గంధపు చెట్లను స్మగ్లింగ్ చేస్తుంది. దానిలో సుకుమార్ హీరోఇజం చూపించాడు. కానీ కొరటాల శివ ప్రకృతిని ప్రేమించే ఒక వ్యక్తిని హీరోగా చూపించాడు. అలానే సినిమా మొదట్లోనే ప్రకృతి గురించి ఒక పాటను పెట్టాడు. కొన్ని సందర్భాలలో కూడా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇది ఒక అరుదైన చెట్టు ఈ చెట్టుని ఇలానే ఉంచనివ్వండి అంటూ ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు అలానే జనతా గ్యారేజ్ అనేది ఒక అరుదైన సినిమా అని చెప్పాలి. హీరోతో మంచి చెప్పిస్తూ కూడా ఒక కమర్షియల్ హిట్స్ సాధించాడు శివ.

- Advertisement -

Janatha Garage

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందించాడు. ఆచార్య మినహాయిస్తే కొరటాల శివ చేసిన అన్ని సినిమాలు కి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కొరటాల శివ మాటలు ఈ కాంబినేషన్ అంతా కూడా ఒక ప్రత్యేకమని చెప్పాలి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది నేటికీ ఈ అరుదైన సినిమా వచ్చి ఎనిమిదేళ్లు అయింది.ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు