OTT Movie : ఓటిటిని ఊపేస్తున్న హైజాక్ సిరీస్… ఫ్లైట్ జర్నీ అంటేనే వణుకు పుట్టించే స్టోరీ

OTT Movie : థియేటర్లో కంటే డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న సినిమాలు సిరీస్ లకు ఆదరణ రోజురోజుకు పెరుగుతుంది. సాధారణంగా థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకు ఫ్యామిలీ అందరిని తీసుకొని హడావిడిగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇక అక్కడ టికెట్లతో పాటు స్నాక్స్ ఫుడ్ అంటూ అనవసరమైన ఖర్చులు ఎన్నో ఉంటాయి. అందుకే హ్యాపీగా ఇలా డైరెక్ట్ గా ఓటీటీ  స్ట్రీమింగ్ కు  రెడీ అయ్యే సినిమాలను ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూడడానికి జనాలు బాగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఓటీటీ లోకి వచ్చి గంటల వ్యవధిలోనే ట్రెండింగ్ లో నిలిచిన ఓ సిరీస్ ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయంలోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ గురించి. ఈ సిరీస్ టాప్ వన్ లో ట్రెండింగ్ అవుతుంది. ఈ సిరీస్ పేరు ఐసి 814 : ది కాంధహర్ హైజాక్. ఇప్పుడు ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆగస్టు 29 నుంచి ఓటిటిలోకి వచ్చిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన మూడు రోజుల్లోనే టాప్ వన్ లో ట్రెండింగ్ రావడం విశేషం. గతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ను చూడడానికి ఓటిటీ మూవీ లవర్స్ విపరీతంగా ఆసక్తిని కనబరుస్తున్నారు. 1999 డిసెంబర్ 24న దేశాన్ని వణికించేలా ఓ ఫ్లైట్ హైజాక్ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. దీనిని దేశ చరిత్రలోనే ఒక డార్క్ డే అని అంటారు. ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు తాజా సిరీస్ ను చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఐసి 814 ది కాంధహర్ హైజాక్ సిరీస్ నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతుంది.

IC 814 The Kandahar Hijack : क्या है कंधार हाईजैक की कहानी, जिस पर बनी वेब  सीरीज नेटफ्लिक्स पर हुई रिलीज

- Advertisement -

స్టోరీ లోకి వెళ్తే…

ఇండియన్ ఎయిర్లైన్స్ ఐసి 814 అనే విమానం ఖాట్మండు నుంచి లక్నో కు 1999 డిసెంబర్ 24న బయలు దేరుతుంది. ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులు ఉంటారు. అందులో 176 మంది ప్రయాణికులైతే, 15 మంది మాత్రం ఫ్లైట్ సిబ్బంది ఉంటారు. ఫ్లైట్ పైకి ఎగరగానే అనుకోకుండా ఐదుగురు ముసుగు ధరించిన ఉగ్రవాదులు ఫ్లైట్ ను హైజాక్ చేసినట్టుగా అనౌన్స్ చేస్తారు. అలాగే విమానాన్ని లాహోర్ కి తీసుకెళ్లకపోతే పేల్చేస్తామని పైలెట్ ను, అందులో ఉన్న ప్రయాణికులను బెదిరిస్తారు. ఈ ఊహించని సంఘటనతో ప్రయాణికులంతా భయాందోళనలతో వణికి పోతుంటే కెప్టెన్ శరణ దేవ్ మాత్రం అందరిని రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఏడు రోజుల పాటు జరిగిన ఈ ఘటన దేశ చరిత్రలో మర్చిపోలేని భయంకరమైన సంఘటనగా మిగిలింది. మరి చివరికి ప్రయాణికులను కెప్టెన్ కాపాడగలిగారా? ఆ ఏడు రోజుల పాటు అసలు ఏం జరిగింది ? అనే విషయం తెలియాలంటే ఈ సిరీస్ పై వెంటనే ఓ లుక్ వేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు