Pawan Kalyan : వరదల కారణంగా రాలేకపోయారు, ఆయన తరపున నేను వచ్చాను – కందుల దుర్గేష్

Pawan Kalyan : నందమూరి బాలకృష్ణ (Balakrishna) కెరియర్ లో మంచి మలుపు తీసుకొచ్చిన షో అన్ స్టాపబుల్. ఆ షో ముందు బాలయ్య ను చూసిన విధానం, ఆ షో తర్వాత బాలయ్యను చూసిన విధానం రెండు కంప్లీట్ గా మారిపోయాయి. అన్ స్టాపబుల్ ముందు బాలయ్యను చాలా మంది కొన్ని విషయాల్లో అపార్థం చేసుకున్నారు. ఒక్కసారి అన్ స్టాపబుల్ మొదలైన తర్వాత అందరికీ బాలకృష్ణ మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. చాలామంది యంగ్ హీరోలు కూడా బాలయ్య బాబుకు బాగా క్లోజ్ అయిపోయారు.

ఒకప్పుడు మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి ఒక కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది. మేము గొప్ప అంటే మేము గొప్ప అంటూ చరిత్రల గురించి రికార్డుల గురించి అప్పట్లో సినిమాల్లో డైలాగులు కూడా ఉంటూ ఉండేవి. అయితే వాటన్నిటిని ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ గా తీసుకొని అప్పట్లో ఫ్యాన్వర్స్ కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ టైమ్స్ లో నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య వివాదాలు పూర్తిగానే తగ్గిపోయాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణకి క్లోజ్ కావటం దీనికి ఒక కారణం కూడా చెప్పొచ్చు.

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ చేసిన పనిని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. పవన్ కళ్యాణ్ రచించిన వ్యూహం అత్యద్భుతంగా వర్కౌట్ అయింది. అయితే రీసెంట్ గా బాలయ్య సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది కానీ వరదల కారణంగా ఆయన రాకపోవడంతో సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ హాజరయ్యారు.

- Advertisement -

Balakrishna

కందుల దుర్గేష్ మాట్లాడుతూ

సుదీర్ఘకాలం పాటు నటిస్తూ 50 సంవత్సరాల పాటు యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వారి కోసం సినిమాలు తీసిన బాలయ్య గారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతఙ్ఞతలు. ఈరోజు ఇలా ఆయనతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషం. ఆయనతో అసెంబ్లీలో కూర్చుంటూ ఉంటాం. ఆయన కీర్తి 100 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా రాలేకపోయారు. ఆయన తరపున నేను వచ్చాను. బాలయ్య గారు సినిమా రంగంలో, వైద్య సేవ రంగంలో, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి అని, దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా దీవించాలని కోరుకుంటున్నాను.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు